క్రీడారంగంపై సర్కార్ చిన్నచూపు
క్రీడారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. క్రీడలపై సీఎం రేవంత్‌రెడ్డి మాటలు అంతర్జాతీయస్థాయి దాటుతుంటే, చేతలు మాత్రం గల్లీస్థాయి దాటడంలేదని దెప్పిపొడిచారు.
- సీఎం ఫుట్‌బాల్ సోకులకు రూ.100 కోట్లు
- గ్రామీణ క్రీడాకారులకు చేసింది సున్నా
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్
హైదరాబాద్, నవంబర్18 (నమస్తే తెలంగాణ): క్రీడారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. క్రీడలపై సీఎం రేవంత్‌రెడ్డి మాటలు అంతర్జాతీయస్థాయి దాటుతుంటే, చేతలు మాత్రం గల్లీస్థాయి దాటడంలేదని దెప్పిపొడిచారు. బుధవారం హరీశ్‌రావును హైదరాబాద్‌లోని నివాసంలో ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ బృందం కలిసి, వినతిపత్రం అందించి సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటూ డబ్బా కొట్టుకొనే రేవంత్‌రెడ్డి.. క్రీడాకారుల సమస్యలు కనిపించడంలేదా? అని ప్రశ్నిం చారు. ఆరు గ్యారెంటీల పేరిట అన్ని వర్గాలను మోసం చేసినట్లే.. క్రీడాకారులను కూడా దగా చేశారని ధ్వజమెత్తారు. ‘ఫుట్‌బాల్ సరదా తీర్చుకొనేందుకు రూ.100 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసిన సీఎం, క్రీడాకారులకు చేసింది గుండుసున్నా’ అని మండిపడ్డారు.
ప్రోత్సాహంలేక భవిష్యత్ ఆగమ్యగోచరం..
రాష్ట్ర క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ, సర్కార్ ప్రోత్సాహంలేక వారి భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఖేలో ఇండియా పోటీలకు ప్రధానిని ఆహ్వానిస్తున్న రేవంత్‌రెడ్డి, క్రీడాకారులకు కోచ్‌లను నియమించాలనే కనీస సోయి లేదా? అని నిలదీశారు. విద్యార్థుల్లో దాగిఉన్న క్రీడాప్రతిభను వెలికితీసే ఖాళీగా ఉన్న పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేయాలనే ఆలోచనలేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘కోచ్‌లు లేకుంటే వారికి ఎవరు మార్గదర్శనం చేస్తారు? పీఈటీలు, పీడీలు లేకుండా మీరు ఏర్పాటు చేస్తానంటున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది?’అని ప్రశ్నించారు. ఖేలో ఇండియా పోటీల్లో తెలంగాణ సత్తాచాటాలంటే ముందుగా కోచ్‌లను నియమించాలని, వెంటనే పీఈటీ, పీడీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్ పెంచండి..
ప్రోత్సాహకాలు ఇవ్వండి..
జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. క్రీడా బడ్జెట్‌కు నిధుల కేటాయింపును పెంచి ఖర్చుచేయడంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేసి, ఆధునిక శిక్షణ కేంద్రాలు, మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని, క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకమైన ఎంపిక విధానం కల్పించాలని అన్నారు. క్రీడారంగ అభివృద్ధి అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రకటనలు, మైకుల ముందు ప్రగల్భాలు కాదని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అవకాశాలు కల్పించడమని హితవుపలికారు. క్రీడాకారుల భవిష్యత్తుతో చెలగాటమాడడం మానేసి, హకులను కాపాడి, వారి ఆశయ సాధనకు తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు.
ఉప సర్పంచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలి
నల్లగొండ రూరల్, నవంబర్ 18: ఉప సర్పంచ్‌లకు నెలకు రూ. 5 వేలు, వార్డు సభ్యులకు రూ. 3 వేల గౌరవ వేతనం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్‌లు, వార్డుసభ్యుల హక్కుల సాధనకోసం ఈ నెల 27 న కరీంగనర్ సర్కస్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఉపసర్పంచ్, వార్డుసభ్యుల భారీ బహిరంగ సభ పోస్టర్‌ను బుధవారం ఆయన హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఉపసర్పంచ్, వార్డుసభ్యుల పేర్లు శిలాఫలకాల మీద పెట్టేలా జీవో జారీచేయాలని, పం చాయతీ పరిధిలో అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చే యాలని కోరారు. ఈ నెల 27న జరిగే సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచ్‌లు, వార్డు స భ్యులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ , నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, కరీనగర్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

