చీరలు వాయిదా.. బీమా నో ఫాయిదా
పూర్తిస్థాయిలో వస్త్రం ఉత్పత్తి చేయనేలేదు. ఇంకా 1.50 కోట్ల వస్త్రం తయారు కాయాల్సి ఉన్నది. ఇంకా కొన్ని జిలాలకు చీరలు అందనేలేదు. కానీ, ఇందిరమ్మ చీరల పంపిణీకి ఆర్భాటంగా సిద్ధమైన ప్రభుత్వం.. ముందురోజే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
- వస్త్రం తయారు కాకుండానే పంపిణీకి సిద్ధం
- 7 కోట్లకు 5.5 కోట్ల మీటర్ల వస్త్రమే ఉత్పత్తి
- 25% పెండింగ్.. అన్ని జిల్లాలకు చేరని వైనం
- నేడు చీరల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటన
- వాయిదా వేస్తూ ముందురోజే సర్కార్ నిర్ణయం
- ఇందిరమ్మ బీమా.. దరఖాస్తులతోనే సరి!
- ఆరంభంలోనే పథకం అమలుపై నీలినీడలు
- భారీ బందోబస్తు నడుమ నేడు సిద్దిపేటకు సీఎం
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ): పూర్తిస్థాయిలో వస్త్రం ఉత్పత్తి చేయనేలేదు. ఇంకా 1.50 కోట్ల వస్త్రం తయారు కాయాల్సి ఉన్నది. ఇంకా కొన్ని జిలాలకు చీరలు అందనేలేదు. కానీ, ఇందిరమ్మ చీరల పంపిణీకి ఆర్భాటంగా సిద్ధమైన ప్రభుత్వం.. ముందురోజే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సిద్దిపేటలో గురువారం ముఖ్యమంత్రి చీరల పంపిణీని ప్రారంభించనున్నట్టు ఇప్పటివరకూ ప్రభుత్వ పెద్దలు ఊదరగొడుతూ వచ్చారు.
తొలివిడుత కొందరికే ఇచ్చి మిగతా వారికి విడతల వారీగా పంపిణీ చేస్తూ ప్రచారం చేసుకోవాలనే యోచన చేసినట్టు తెలుస్తున్నది. కానీ, పూర్తిస్థాయిలో చీరలు ఉత్పత్తికాక పంపిణీని వాయిదా వేస్తున్నట్టు బుధవారం సాయంత్రం తెలిపింది. ఆర్డర్లు ఇచ్చిన చీరలు ఇంకా తయారు కాకుండానే ఇందిరమ్మ చీరల పథకం పేరిట సర్కార్ పెద్దల ఆర్భాటపు ప్రకటనలు గుప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వస్త్ర ఉత్పత్తి, చీరల తయారీని ప్రభుత్వం దాచిపెడుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని సమైక్య సంఘాల మహిళా సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోటి చీరలు తయారు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇందులోభాగంగా సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, నల్లగొండ జిల్లాల్లోని సుమారు 175 మ్యాక్స్ సంఘాలకు గత ఫిబ్రవరిలో ఆర్డర్లు ఇచ్చింది. ఇందులో దాదాపు 90 శాతానికి పైగా 6.33 కోట్ల మీటర్ల వస్త్రం తయారీ బాధ్యతను సిరిసిల్లలోని 133 మ్యాక్స్ సంఘాలకు ఆర్డర్లు అప్పగించింది. ఇప్పటివరకు సిరిసిల్లలో 5.40 కోట్ల వస్ర్తాన్నే ఉత్పత్తి చేసినట్టు, మరో కోటి మీటర్లదాకా పెండింగ్లో ఉన్నట్టు అధికారులే చెప్తున్నారు. మిగిలిన జిల్లాల్లో సైతం దాదాపు 50 లక్షల మీటర్ల వస్త్రం సిద్ధంకాలేదని, మొత్తంగా 1.50 కోట్ల వస్త్రం తయారు చేయాల్సి ఉన్నదని తెలుస్తున్నది.
చీరల పంపిణీపై ఆర్భాటం
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గురువారం నుంచి మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంతోపాటు సంబంధిత శాఖ మంత్రి అనేకసార్లు వివిధ వేదికలపై ఇదే విషయాన్ని పదే పదే ప్రకటించారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో గురువారం సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. పూర్తిస్థాయిలో చీరలు ఉత్పత్తికాకుండా, ఇప్పటివరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చేరవేయకుండానే ప్రభుత్వం హడావుడి చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పటివరకు 90 శాతానికి పైగా ఆర్డర్లు ఇచ్చిన సిరిసిల్ల జిల్లాలో కూడా మహిళా సంఘాల సభ్యులకు సమాచారం ఇవ్వనేలేదని మహిళా సంఘాల బాధ్యులు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం సిద్దిపేటలో లాంఛనంగా చీరల పంపిణీని ప్రారంభించి 2, 3 నెలల దాకా లబ్ధిదారులకు అందించనున్నదని ప్రచారం జరిగింది. కానీ, చీరలన్నీ సిద్ధంకాకపోవడంతో సిద్దిపేటలో గురువారం నిర్వహించనున్న ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రభుత్వం వాయిదా వేసినట్టు తెలిసింది.
చీరల పంపిణీ వాయిదా
సిద్దిపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రభుత్వం వాయిదా వేసింది. ఇదే విషయమై సెర్ప్ సీఈవోను సంప్రదించగా సీఎంవో కార్యాలయం నుంచి ఇప్పటివరకు షెడ్యూల్ రాలేదని తెలిపారు. రెండు నెలలుగా సమైక్య మహిళలకు ఇందిరమ్మ జయంతి రోజున చిలుకపచ్చ చీరలు పంపిణీ చేస్తామని ప్రభుత్వ వర్గాలు హడావుడి చేశాయి. మం త్రులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ల్లో నమూనా చీరలను ప్రదర్శించి ఊదరగొట్టారు. ఇంత హంగామా చేసి చివరికి ఉసూరుమనిపించారు. ఈ విషయంపై అధికార పార్టీకి చెందిన ఓ కీలకనేత సైతం అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇందిరమ్మ పేరిట పథకాలను ఆపడంలాంటి వ్యవహారాలతో ప్రజల్లో పలుచనవుతున్నామని వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

