మంత్రి ఇలాకా బోగస్ కాక!
చనిపోయినవారిని మళ్లీ బతికిస్తూ.. వారి పేర్లతో లేబర్ కార్డులు సృష్టించి.. ఆ తర్వాత వారు మళ్లీ మరణించినట్టు డెత్ సర్టిఫికెట్లు పెట్టి బీమా సొమ్ము కొల్లగొడుతున్న కుంభకోణంలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో బయటపడ్డ ఈ భారీ స్కామ్ కార్మికశాఖ ప్రమేయంతోనే జరిగినట్టు పలు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే మృతులు పునరుర్జీవం పోసుకుంటున్నట్టు కార్మిక శాఖ నివేదికల ద్వారా తెలుస్తున్నది.
- కుంభకోణానికి కేరాఫ్ వివేక్ శాఖ!
- మృతుల పేరిట సాగుతున్న దోపిడీ
- మంచిర్యాల జిల్లాలో 74, పెద్దపల్లిలో 80 నకిలీ బీమా క్లెయిమ్‌లు
- చాలా దరఖాస్తులకు మంత్రి కార్యాలయం నుంచే సిఫార్సులు
- దర్యాప్తు రెండు జిల్లాలకే పరిమితం
- జీవో సవరణపై మంత్రికి, శాఖ కార్యదర్శికి మధ్య విభేదాలు
చనిపోయినవారిని మళ్లీ బతికిస్తూ.. వారి పేర్లతో లేబర్ కార్డులు సృష్టించి.. ఆ తర్వాత వారు మళ్లీ మరణించినట్టు డెత్ సర్టిఫికెట్లు పెట్టి బీమా సొమ్ము కొల్లగొడుతున్న కుంభకోణంలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో బయటపడ్డ ఈ భారీ స్కామ్ కార్మికశాఖ ప్రమేయంతోనే జరిగినట్టు పలు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే మృతులు పునరుర్జీవం పోసుకుంటున్నట్టు కార్మిక శాఖ నివేదికల ద్వారా తెలుస్తున్నది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న బెల్లంపల్లి నియోజకవర్గంలోనే బోగస్ క్లెయిమ్‌లు అత్యధికంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన బోర్డు నిధులపై కన్నేసిన అక్రమారులకు కార్మికశాఖ మంత్రి కార్యాలయమే కేంద్రంగా మారిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సొంత జిల్లా మంచిర్యాలలో కార్మిక బీమా క్లెయిమ్‌ల పేరుతో భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. దశాబ్దాల కిందట చనిపోయిన వారి పేర్లతో మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించడం, అనారోగ్య మరణాలను ప్రమాద మరణాలుగా చిత్రీకరించడం, బోగస్ ఎఫ్ఐఆర్లు, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో కోట్ల రూపాయల పరిహారం కాజేయటం వరకు ఒక వ్యవస్థీకృత దందా సాగుతున్నట్టు ఆధారాలు బయటపడుతున్నాయి.
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనే వందల సంఖ్యలో అనుమానాస్పద క్లెయిమ్‌లు వెలుగుచూడగా, వాటి విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని దరఖాస్తులు తిరసరణకు గురైన తర్వాత కూడా వాటిని మళ్లీ పరిశీలించాలని కోరుతూ మంత్రి కార్యాలయం నుంచి లేఖ వెళ్లినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలిసింది. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రతి లేఖను, దాని ఆధారంగా జరిగిన ప్రతి ఫైల్ కదలికను విచారణలో పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అటు తిరిగీ ఇటు తిరిగీ ఆయన మెడకే
క్లెయిమ్‌ల అక్రమాలపై తీవ్ర ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా బోర్డు క్లెయిమ్‌లను పరిశీలించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే విచారణ పరిధి విషయంలోనే కార్మికశాఖలో వివాదం మొదలైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా విచారణ జరపాలనే ప్రతిపాదనపై శాఖ కార్యదర్శి అభ్యంతరాలు వ్యక్తంచేసినట్టు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. మంత్రి సొంత జిల్లాలోనే ఎకువ అక్రమాలు బయటపడుతున్నందున ఆ కుటుంబ ప్రమేయం ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో లేదా ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విచారణ జరిపిస్తే సరిపోతుందన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తున్నది.
ఈ క్రమంలో విచారణ పరిధికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రెండుసార్లు సవరించినట్టు సమాచారం. చివరకు విచారణను మంత్రి సొంత జిల్లా మంచిర్యాలకే పరిమితం చేసినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. విచారణ కేవలం తన జిల్లాకే పరిమితం కావటం వెనుక సీఎంప్రమేయం ఉన్నదని వివేక్ అనుచరులు భావిస్తున్నట్టు తెలిసింది. రెండు జీవోల సవరణకు సంబంధించిన ప్రతిపాదనలు, ఫైల్నోట్లు, అధికారుల అభిప్రాయాలు బయటపడితే ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతన్నది స్పష్టమయ్యే అవకాశం ఉన్నది వారు అనుకుంటున్నారు.

సీఈవో విషయంలోనూ మంత్రి పట్టుదల
బోర్డు సీఈవోగా వ్యవహరించిన కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్ వ్యవహారశైలిపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. బోర్డులో నిధుల దుర్వినియోగానికి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని భావించిన మంత్రి, ఆయనను సీఈవో బాధ్యతల నుంచి తప్పించాలని పలుమార్లు ఆదేశించినట్టు కార్మిక శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే శాఖ కార్యదర్శి మాత్రం సీఈవో పనితీరును సమర్థిస్తూ ఆయనను కొనసాగించేందుకు మొగ్గుచూపినట్టు తెలుస్తున్నది.
ఈ విషయంలో మంత్రి, కార్యదర్శి మధ్య విభేదాలు తీవ్రమయినట్టు చెప్తున్నారు. చివరికి మంత్రి సీఎంవోకు ఫిర్యాదు చేసిన తర్వాతే సీఈవోను ఆ బాధ్యతల నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకవైపు బోర్డులో అక్రమాలపై విచారణ జరగాల్సి ఉండగా, మరోవైపు బాధ్యులుగా భావిస్తున్న అధికారుల విషయంలో మంత్రి, కార్యదర్శి మధ్య ఈ స్థాయి విభేదాలు తలెత్తడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కార్మిక శాఖలో ఐఎంఎస్ డైరెక్టర్ పోస్టు విషయంలోనూ మంత్రి, కార్యదర్శి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. ఈఎస్ఐ దవాఖానల నిర్వహణ బాధ్యతలు చూసే ఐఎంఎస్‌కు డైరెక్టర్‌గా వైద్యుడిని నియమించాలని మంత్రి ప్రతిపాదించగా, ఐఏఎస్ అధికారే ఆ బాధ్యతల్లో కొనసాగాలని కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మంత్రి సొంత జిల్లాలోనే నకిలీ బీమా క్లెయిమ్‌లు
మంచిర్యాల జిల్లాలో 84 బీమా క్లెయిమ్‌లను పరిశీలించగా 74 దరఖాస్తులకు సరైన ఆధారాలు లేవని దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. పెద్దపల్లి జిల్లాలో 91 క్లెయిమ్‌లను పరిశీలించగా 80 బోగస్‌గా తేలినట్టు సమాచారం. శాశ్వత వైకల్యం కింద పరిహారం పొందిన వారిలోనూ అనర్హులు ఉన్నట్టు గుర్తించారు. ఈ రెండు జిల్లాల్లోనే ఇంత భారీ సంఖ్యలో అనుమానాస్పద క్లెయిమ్‌లు వెలుగుచూడటం కార్మిక శాఖలో కలకలం రేపింది. మంత్రి సొంత జిల్లా మంచిర్యాల పరిధిలోనే ఇంతటి అక్రమాలు బయటపడటం మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది.
మంత్రి పర్యవేక్షణలో ఉండాల్సిన కార్మికశాఖలో ఈ వ్యవహారం సాగడం, ఆయన కార్యాలయం నుంచి వచ్చిన సిఫార్సులపై అనేక అనుమానాలు తలెత్తడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బూదాకుర్దు, పాత బెల్లంపల్లి, పెరపల్లి గ్రామపంచాయతీల పరిధిలో ఏకంగా 11 నకిలీ డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో నలుగురు పంచాయతీ కార్యదర్శులు, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌పై సస్పెన్షన్ వేటు వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

