సాగర్ జలాలు ఆంధ్రార్పణం.. ఏపీ నీటి చోరీపై మాట్లాడరేం.. సీఎం, నీళ్ల మంత్రి ఏం చేస్తున్నట్టు?
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఏపీ గండికొడుతూ డెడ్ స్టోరేజీ నుంచి కూడా జలాలను తరలించేందుకు ప్రాజెక్టు కడుతుంటే రేవంత్ సర్కార్‌కు సోయిలేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కనీసం ఆ జిల్లాకు చెందిన, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నట్టని నిలదీశారు.
- 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రికి ఏపీ దోపిడీ తెల్వకుండా పోయిందా?
- ఇకనైనా అడ్డుకుంటరా, లేదా?.. లేదంటే ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తం: కేటీఆర్
- నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిస్థితి ఏంగావాలె?
- ఆంధ్రా బాబు కుట్రలో బీజేపీకీ భాగస్వామ్యం
- పాలమూరు, నల్లగొండను ముంచిందే కాంగ్రెస్
- నేడు మళ్లీ అదే ద్రోహం చేస్తున్న రేవంత్ సర్కార్
- ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు చేసినదాని కంటే
- తెలంగాణకు రేవంత్ చేస్తున్న ద్రోహమే ఎక్కువ
- ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- బాబు గండి కొడుతుంటే రేవంత్‌కు సోయిలేదా?
ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు గండి కొట్టిండ్రు. ఈనాటికీ కృష్ణాజలాలను ఏపీ యథేచ్ఛగా దోచుకుపోతున్నది. ఇప్పుడు నాగార్జునసాగర్‌కూ అదే తరహాలో గండి కొడుతున్నది. కేఆర్ఎంబీ, కేంద్రం పర్మిషన్ ఇవ్వకుండానే ఏడాది నుంచి పనులు చేస్తున్నది. ఈ విషయం 18 గంటలు పనిచేసే తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా తెలియని దుస్థితి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నాటి ముఖ్యమంత్రులు చేసిన దానికంటే ఎకువ ద్రోహం ఇవాళ రేవంత్‌రెడ్డి చేస్తున్నడు.
చంద్రబాబు నాయుడు 730 కిలోమీటర్ల అవతల కుప్పానికి కృష్ణా నీళ్లు తీసుకొని పోయిండు. రేవంత్‌రెడ్డి మాత్రం 70 కిలోమీటర్ల పరిధిలో మొత్తం పాలమూరు జిల్లాకు కృష్ణా నీళ్లు ఇవ్వలేదు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌కు సిగ్గనిపిస్తలేదా? ఈ సీజన్లో శ్రీశైలం, జూరాల నుంచి మొత్తం కలిపితే 50 టీఎంసీల నీళ్లు కూడా ఎత్తిపోయలే. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటదా?
– కేటీఆర్
హైదరాబాద్, నవంబర్18 (నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఏపీ గండికొడుతూ డెడ్ స్టోరేజీ నుంచి కూడా జలాలను తరలించేందుకు ప్రాజెక్టు కడుతుంటే రేవంత్ సర్కార్‌కు సోయిలేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కనీసం ఆ జిల్లాకు చెందిన, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నట్టని నిలదీశారు. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని అన్యాయమని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డితో కలిసి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నదీ జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి చెప్తే భారతమంత, రాస్తే రామాయణమంత అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వందల సార్లు సభల్లో చెప్పారని గుర్తుచేశారు.
తెలంగాణ నదీ జలాలు, నీటి వనరులను ఆకళింపు చేసుకున్న తర్వాత, విశ్రాంత ఇంజినీరు విద్యాసాగర్‌రావు, ప్రొఫెసర్ జయశంకర్‌తో పాటు రిటైర్డ్ ఇంజనీర్లు, ఎంతోమంది నీటి వనరుల నిపుణులతో గంటలుగంటలు చర్చించిన తర్వాత సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎన్నటికీ న్యాయం జరుగబోదని, ప్రత్యేక తెలంగాణ రావాల్సిందేనని పట్టుబట్టి తుదకు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌తో తెలంగాణ ఉద్యమం చేపట్టారని వివరించారు. తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసి పాలమూరు, నల్లగొండ జిల్లాలను ముంచిందే కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనంతరం నల్లగొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా నిజాం రూపొందించిన ఏలేశ్వరం ప్రాజెక్టును అక్కడి నుంచి నందికొండకు మార్చారని, తద్వారా నల్లగొండ జిల్లాకు తీరని విద్రోహం చేశారని వివరించారు. ఫ్లోరోసిస్‌ను నల్లగొండకు గిఫ్ట్‌గా ఇచ్చింది కాంగ్రెస్సేనని నిప్పులు చెరిగారు. అప్పర్ కృష్ణా, భీమా, ఆర్డీఎస్ తదితర ప్రాజెక్టుల ద్వారా 174 టీఎంసీల కృష్ణాజలాలను మళ్లించి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు నిజాం రాజు చేసిన ప్రణాళికలను తుంగలో తొక్కిందని, పాలమూరును వలసల జిల్లాగా మార్చిందని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు కూడా ఇందులో పాత్ర ఉన్నదని వివరించారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న తర్వాత ఇంకా అధోగతి పాలైందని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నదీజలాల్లో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్‌తోపాటు, టీడీపీ కూడా కారణమేనని నిప్పులు చెరిగారు.
సొంత నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌కు ఏపీ బొక కొట్టి నీళ్లు తీసుకుపోతుంటే నీటి పారుదల శాఖ మంత్రికి సోయి లేదు. జల దోపిడీకి అడ్డుకట్ట వేసే తెలివిలేదు. తాగునీరు లేక సూళ్లు, హాస్టళ్లకు సెలవులిచ్చి పిల్లల్ని ఇంటికి పంపిస్తా ఉంటే సిగ్గు లేకుండా తాగునీటికి ఢోకా లేదని మంత్రి మాట్లాడుతున్నరు.
-కేటీఆర్

బీఆర్ఎస్ హయాంలో రివర్స్ మైగ్రేషన్
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నదీజలాల వినియోగంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషిని కేటీఆర్ కొనియాడారు. కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారని, ఆర్డీఎస్ ఆయకట్టును స్థిరీకరించేందుకు తుమ్మిళ్ల లిఫ్ట్‌ను నిర్మించారని, తద్వారా 8 లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చారని గుర్తుచేశారు. తద్వారా పాలమూరు జిల్లాకే కర్ణాటక, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందని తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించారని, వట్టెం, కరివెన, ఏదుల, ఉద్ధండాపూర్, నార్లాపూర్ తదితర రిజర్వాయర్లను పూర్తిచేశామని, రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే విధంగా పంపింగ్ స్టేషన్లు సిద్ధం చేశామని వివరించారు. 2023 సెప్టెంబర్‌లోనే వెట్న్ నిర్వహించారని గుర్తుచేశారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సైతం టెండర్లను పిలిచారని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నల్లమల బిడ్డనని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ఆ కాలువల టెండర్లను రద్దు చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే పాలమూరు, నల్లగొండ జిల్లాలకు తీరని విద్రోహాన్ని తలపెడుతున్నదని మండిపడ్డారు. ఆ కాలువలను పూర్తిచేసి ఉంటే బ్రహ్మాండంగా నీళ్లు వచ్చేవని తెలిపారు.
సాగర్‌పై మరో పోతిరెడ్డిపాడు
కేవలం కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే రాష్ట్రంలో ప్రాజెక్టులను పడావు పెడుతున్నారని కేటీఆర్ నిప్పులుచెరిగారు. గతంలో సమైక్య పాలనలో పోతిరెడ్డిపాడు పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు గండి కొట్టారని, తద్వారా ఈనాటికీ కృష్ణాజలాలను యథేచ్ఛగా దోచుకుపోతున్నారని వివరించారు. ఇప్పుడు తాజాగా నాగార్జునసాగర్‌కు అదే తరహాలో గండి కొట్టేందుకు సిద్ధమయ్యారని, తాగునీటి పేరిట ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి సొరంగం తవ్వకం మొదలు పెట్టిందని తెలిపారు. ఎవరి అనుమతులూ లేకుండా, కేఆర్ఎంబీ, కేంద్రం పర్మిషన్ ఇవ్వకుండానే ఏడాది నుంచీ పనులు కొనసాగిస్తున్నదని వెల్లడించారు. ఆ విషయం ఎకడా ఎవరికీ తెలియదని, కనీసం 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రికి కూడా తెలియని దుస్థితి నెలకొన్నదని దుయ్యబట్టారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విజయపురి సౌత్ డెడ్‌స్టోరేజ్‌లో పెట్టి.. అంటే కింది నుంచి కూడా నీళ్లు తీసుకుపోయేలా, తెలంగాణకు శాశ్వతంగా బొక పెట్టేలా వ్యవహరిస్తున్నదని తెలిపారు. భవిష్యత్తులో అది మరో పోతిరెడ్డిపాడు అవుతుందని హెచ్చరించారు. పేరుకు తాగునీటి పథకమని, 9 టీఎంసీలు అని చెప్తున్నా, సాగునీటిని కూడా తీసుకు పోయేలా ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నాటి ముఖ్యమంత్రులు చేసిన దానికంటే ఎకువ ద్రోహం ఇవాళ రేవంత్‌రెడ్డి చేస్తున్నాడని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు 730 కిలోమీటర్ల అవతల కుప్పానికి కృష్ణా నీళ్లు తీసుకొని పోయిండు. రేవంత్‌రెడ్డి మాత్రం 70 కిలోమీటర్ల పరిధిలో మొత్తం పాలమూరు జిల్లాకు కృష్ణా నీళ్లు ఇవ్వలేదు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌కు సిగ్గనిపిస్తలేదా? ఈ సీజన్లో శ్రీశైలం, జూరాల కాడ మొత్తం కలిపితే 50 టీఎంసీల నీళ్లు కూడా ఎత్తిపోయలే. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటదా?
-కేటీఆర్
ఎల్ నినో కాదు.. అనుముల నినో..
రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కారణం ఎల్ నినో కాదని, అనుముల నినో అని కేటీఆర్ ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో తీవ్ర నీటికొరత ఉన్నదని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటిస్తున్నారని, బండ్లు కడుకోకండి, వారానికోసారి స్నానం చేయండంటూ ఉపదేశాలు ఇస్తున్నారని, మరోవైపు అందుకు భిన్నంగా నీటి పారుదల శాఖ మంత్రి మాత్రం తాగునీటికి ఇబ్బందే లేదని సెలవిస్తున్నారని విమర్శించారు. ‘అసలు ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నాడా? ఆకాశంలో ఉంటున్నాడా? ఎకడుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్లు సరార్ నడుపుతున్నారా, సరస్ నడుపుతున్నారా? కూడా తెల్వది’ అంటూ దెప్పిపొడిచారు. ‘అక్టోబర్‌లో హైదరాబాద్‌లో 2,50,000 ట్యాంకర్లు బుక్కయ్యాయి. కనీసం నీటి పారుదలశాఖ మంత్రికి సోయి ఉన్నదా? రోజుకు 8,000 ట్యాంకర్లు హైదరాబాద్‌లో ఇవాళ బుక్కవుతున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంటే సిగ్గు లేకుండా నీటి కరువు లేదంటారు. అటు మీ నల్లగొండ జిల్లాలో నీటి పారుదల శాఖ మంత్రికి సోయి లేదు. నాగార్జునసాగర్‌కు ఏపీ బొక కొట్టి నీళ్లు తీసుకుపోతుంటే సోయి లేదు. నీ జిల్లాలో జరుగుతున్న జల దోపిడీకి అడ్డుకట్ట వేసే తెలివి లేదు. తాగునీరు లేక సూళ్లు, హాస్టళ్లకు సెలవులిచ్చి పిల్లల్ని ఇంటికి పంపిస్తా ఉంటే సిగ్గు లేకుండా తాగునీటికి ఢోకా లేదని మంత్రి మాట్లాడుతున్నరు’ అని నిప్పులుచెరిగారు.
కాంగ్రెస్ అసమర్థతవల్లే ఆంధ్రాకు మన నీళ్లు
వరద వచ్చిన సమయంలో కల్వకుర్తి, భీమా, గోదావరిలో కాళేశ్వరం పంపులను ఆన్ చేయలేదని, జూరాల నుంచీ నీటిని వినియోగించలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్థత కారణంగా కృష్ణా నుంచి జలాలు జూరాల దిగువన శ్రీశైలం ప్రాజెక్టు, తద్వారా ఆంధ్రా అర్పణం అయ్యాయని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు 730 కిలోమీటర్ల అవతల కుప్పానికి కృష్ణా నీళ్లు తీసుకొని పోతే 70 కిలోమీటర్ల పరిధిలో పాలమూరు జిల్లాకు మాత్రం రేవంత్‌రెడ్డి కృష్ణా నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఈ సీజన్లో శ్రీశైలం, జూరాల వద్ద మొత్తం కలిపితే 50 టీఎంసీల నీళ్లు కూడా ఎత్తిపోయలేదని, ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? అని విమర్శించారు. ఇంకో 60-65 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉన్నా వదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్లు వేసి గెలిపించిన నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజల ప్రయోజనాలకే ఇవాళ రేవంత్‌రెడ్డి ద్రోహం చేస్తున్నాడని విమర్శించారు. కృష్ణా, గోదావరి నుంచి 1000 టీఎంసీలను వృథా చేశారని ధ్వజమెత్తారు. ఏపీలో క్రాప్ హాలిడే లేదని, తెలంగాణలో మాత్రం ఎందుకు వచ్చిందని నిలదీశారు.
కేసీఆర్ ఫుల్ కెపాసిటీతో పంపులు బిల్డ్ చేసి పెడితే వాడుకోవు. నీళ్లెత్తండి అని చెప్పిన విశ్రాంత ఇంజినీర్ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి వంటి వారిని పట్టుకొని బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటవు. ఎల్ నినో వస్తుంది. కరువు వస్తుంది. పంటలు ఎట్లానయ్యా ముఖ్యమంత్రీ? అంటే బీఆర్ఎస్ నాయకుల రక్తాలు చల్లాలంటవు. ఇంతకంటే కుసంసారి.. ఇంతకంటే దిగజారుడు వ్యవహారం ఎవరైనా చేస్తారా?
– కేటీఆర్

బీజేపీకీ భాగస్వామ్యం
ఏపీ జలదోపిడీకి ద్వారాలు తెరిచింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వమేనని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఆదిత్యానాథ్ దాస్ అనే ఐఏఎస్ అధికారి ఏపీ సాగునీటి శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా ఆ రోజు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిండు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిండు. అలాంటి వాడిని తీసుకొచ్చి సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకోమని మీకు సలహా ఇచ్చిన సన్నాసి ఎవడు? ఎవరి ఒత్తిడితో పెట్టుకున్నవు? తెలంగాణలో ఇంజినీర్లు లేనట్టు విజయవాడకు సంబంధించిన వ్యక్తి రమేశ్‌బాబును ఈఎన్సీగా ఎట్ల పెట్టుకున్నవు? ఉద్యోగ విరమణ పొందినా మరో ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. అసలు కేఆర్ఎంబీలో మనకు ప్రాతినిధ్యమే లేదు. అందులో ఉన్నవారంతా ఆంధ్రా అధికారులే. తెలంగాణ హకుల గురించి మాట్లాడేవాడే లేడని ఇంజినీర్లే చెప్తున్నారు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఇంకా ఘోరం ఏందంటే ఏపీ చేపట్టిన పనులకు ఏ పర్మిషన్ లేదు. కేఆర్ఎంబీ పర్మిషన్ లేదు. జల్ జీవన్ మిషన్ కింద మోడీ ఆశీస్సులు కూడా ఉన్నాయంట ఈ పథకానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇష్టమొచ్చినట్టు యథేచ్ఛగా దోపిడీ చేస్తుంటే ఇకడ రాష్ట్ర ప్రభుత్వం కండ్లప్పగించి చూస్తున్నది.
దానికి మోడీ కూడా మౌనంగా సహకరించి 1,658 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం చేపడుతున్నరు. రాబోయే ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తరట. పేరుకు, బయటకు చెప్పేది 9 టీఎంసీల మంచినీటి పథకం. రేపు మరో పోతిరెడ్డిపాడు అయ్యే ప్రమాదం ఉన్నది. ఇవాళ చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో మెదిలే రేవంత్‌రెడ్డి, ఆయన చెప్పుచేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం, మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ మూడూ కలిసి తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేస్తున్నయ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుంకిశాల కూలిపోయింది. రూ.100 కోట్లు నష్టం వాటిల్లింది. వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది. అయినా ఎన్డీఎస్ఏ రాదు. బీజేపీ మాట్లాడదు. మళ్లీ పోరాటం చేయాల్సింది బీఆర్ఎస్సే. ఇవాళ సాగర్‌లో ఇంత అన్యాయం జరుగుతున్నా బీజేపీ నుంచి ఒకడైనా గొంతు మెదపలే. బీఆర్ఎస్ నేతలు నోముల భగత్, ఎంసీ కోటిరెడ్డి ధర్నా చేస్తే అరెస్ట్ చేసిండ్రు. ఏపీ చేపట్టిన ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ ప్రజలు కూడా తాగునీటి కోసం తండ్లాడే పరిస్థితి వస్తుంది. ఏపీ నీటి దోపిడీలో కేవలం కాంగ్రెస్‌కే కాదు.. బీజేపీ పాత్ర కూడా ఉన్నది. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు పక రాష్ట్రం నీళ్లను కొల్లగొడుతుంటే ఎవరూ స్పందించరా? మీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేరా? బీజేపీకి ఓట్లు వేసినందుకు తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఇదేనా?’ అని నిలదీశారు.
తెలంగాణ నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ గతంలో చేసినట్టు ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే చూస్తూఊరుకోం. జల దోపిడీని అడ్డుకునేదాకా వదిలిపెట్టం. అవసరమైతే న్యాయపోరాటం చేస్తం. బహిరంగ సభల ద్వారా రైతులు, ప్రజలను జాగృతం చేస్తం. ఏపీ ప్రభుత్వం తెలంగాణలో తన తాబేదారులను అడ్డం పెట్టుకొని ఏ రకంగా వనరులను కొల్లగొడుతున్నదో వివరించి ఎండగడుతం.
-కేటీఆర్

జల దోపిడీని అడ్డుకునేందుకు ఏం చేస్తున్నరు?
నాగార్జునసాగర్‌ను తెలంగాణకు కాకుం డా చేసే కుట్రలను కాంగ్రెస్, ఏపీ సర్కార్ చేస్తున్నదని కేటీఆర్ నిప్పులు చెరిగారు. వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రి సమాధానం చెప్పకొంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘శ్రీశైలంలో ప్రస్తుతం వినియోగానికి కేవలం 3.5 టీఎంసీలే ఉన్నయ్. నాగార్జునసాగర్‌లో కేవలం 52 టీఎంసీలే ఉన్నయ్. ఇలాంటి పరిస్థితుల్లో నీటి అవసరాలను ఎలా తీరుస్తరు? డ్రింకింగ్ వాటర్ పేరిట సాగర్‌కు గండి కొట్టి ఏపీ చేస్తున్న జల దోపిడీని అడ్డుకునేందుకు కేఆర్ఎంబీ వద్ద, తెలంగాణ ప్రభుత్వం వద్ద ఏదైనా కార్యాచరణ ఉన్నదా? ప్రాజెక్టును ఆపాలని ఏపీకి చెప్పిండ్రా? కనీసం అడిగిండ్రా? ప్రస్తుతం ఉన్న 40 టీఎంసీల నీటి నిల్వలను తెలంగాణ తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని, ఏపీ నీటి తరలింపునకు అడ్డుకట్ట వేయాలని కేఆర్ఎంబీకి ఏమైనా ఉత్తరం రాసిండ్రా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘హైదరాబాద్‌తో పాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలకు ఆ జలాశయాల్లో ఎంతమేర నిల్వలు కేటాయించారు?’ అని నిలదీశారు.
ప్రజాక్షేత్రంలో ఎండగడుతం
గతంలో చేసినట్టు ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని, అవసరమైతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే తీవ్ర ప్రతిఘటనను ప్రభుత్వం ఎదురోవాల్సి ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు. ఏపీ చేపట్టిన పనులను నిలుపుదల చేయాలని కేఆర్ఎంబీపై ఒత్తిడి తెస్తామని, తాము కూడా లేఖ రాస్తామని వెల్లడించారు. ఈ జల దోపిడీని అడ్డుకునేదాకా వదిలిపెట్టబోమని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. నల్లగొండలో బహిరంగ సభల ద్వారా రైతులు, ప్రజలను జాగృతం చేస్తామని, ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణలో తన తాబేదారులను అడ్డం పెట్టుకొని ఏ రకంగా వనరులు కొల్లగొడుతున్నదనే విషయాన్ని వివరించి ఎండగడుతామని చెప్పారు. మీడియా కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

