బెంగళూరు: కాలేజీలో చదువుతున్న యువతి అద్దె ఇంట్లో నివసిస్తున్నది. ఆదివారం ఆ ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. అయితే ఉదయం నుంచి ఆ మహిళతో కలిసి ఉన్న వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. (College Woman Found Dead) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల దేవిశ్రీ, ఆచార్య కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఎం) చివరి సంవత్సరం చదువుతున్నది. మదనాయకనహళ్లి ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఆమె నివసిస్తున్నది.
కాగా, ఆదివారం రాత్రి ఆ అద్దె ఇంట్లో దేవిశ్రీ అనుమానాస్పదంగా మరణించింది. ఆ ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రేమ్ వర్ధన్ అనే వ్యక్తితో కలిసి ఆమె అక్కడ ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమ్ వర్ధన్ ఆ ఇంటికి లాక్ చేసి వెళ్లిపోవడంతో దేవిశ్రీని అతడు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు పోస్ట్‌మార్టం కోసం దేవిశ్రీ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న ప్రేమ్ వర్ధన్ ఆచూకీని గుర్తించినట్లు చెప్పారు. త్వరలో అతడ్ని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
Also Read:
Pankaja Munde’s Key Aide Arrested | భార్య ఆత్మహత్య.. మంత్రి కీలక సహాయకుడు అరెస్ట్
Track Stray Dogs At Schools | స్కూల్స్‌లో కుక్కలను నియంత్రించాలని ఆదేశాలు.. మండిపడుతున్న ఉపాధ్యాయులు