IND vs NZ | ఫైనల్లో శాంసన్, అభిషేక్ ఊచకోత.. న్యూజిలాండ్ ముందు రికార్డు లక్ష్యం..!
IND vs NZ : పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో భారత టాపార్డర్ ఊచకోతకు న్యూజిలాండ్ బౌలర్లు బలైపోయారు. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీతో సంజూ శాంసన్(89) చెలరేగిపోయాడు. వీరిద్దరి మెరుపులతో కుదేలైన కివీస్ బౌలర్లను ఇషాన్ కిషన్(54) తుఫాన్ ఇన్నింగ్స్‌తో భయపెట్టాడు.
IND vs NZ : పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో భారత టాపార్డర్ ఊచకోతకు న్యూజిలాండ్ బౌలర్లు బలైపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(52) ఫామ్ అందుకుంటూ అర్ధ శతకం బాదేయగా.. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీతో సంజూ శాంసన్(89) చెలరేగిపోయాడు. వీరిద్దరి మెరుపులతో కుదేలైన కివీస్ బౌలర్లను ఇషాన్ కిషన్(54) తుఫాన్ ఇన్నింగ్స్‌తో భయపెట్టాడు. జేమ్స్ నీషమ్(3-46) ఒకే ఓవర్లో మూడు వికెట్లతో కాస్త స్కోర్ తగ్గినా.. ఆఖర్లో శివం దూబే(26 నాటౌట్) మెరుపులతో భారత్ నిర్ణీత ఓవర్లలో 255 పరుగులతో కివీస్‌కు రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఫైనల్లో భారీ స్కోర్‌తో న్యూజిలాండ్‌కు సవాల్ విసిరింది. నరేంద్ర మోడీ స్టేడియంలో ఓపెనర్లు అభిషేక్ శర్మ(52), సంజూ శాంసన్(89)లు పూనకాలు వచ్చినట్టు న్యూజిలాండ్ బౌలర్లను ఉతికేశారు. తొలి ఓవర్ నుంచే సంజూ ఊచకోతకు తెగబడగా.. కాస్త టైమ్ తీసుకున్నాక అభిషేక్ చెలరేగిపోయాడు. తన మార్క్ విధ్వంసంతో 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడీ హిట్టర్. జాకబ్ డఫ్ఫీ వేసిన ఆరో ఓవర్లో వరుసగా 4, 6, 4, 2, 4 రాబట్టిన లెఫ్ట్ హ్యాండర్ హాఫ్ సెంచరీతో తన స్టయిల్ ఎల్ సెలబ్రేషన్ చేసున్నాడు. వీరిద్దరి విధ్వంసంతో పవర్ ప్లేలో భారత్ అజేయంగా 92 పరుగులు కొట్టింది.
4⃣, 6⃣, 6⃣, 4⃣, 4⃣ 🤯
How about that for a last-over finish by Shivam Dube 🔥🔥
Updates ▶️ https://t.co/5LXBod8bl1#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #Final | #INDvNZ | @IamShivamDube pic.twitter.com/cdgrWhJAfn
— BCCI (@BCCI) March 8, 2026
7.2 ఓవర్లకే వంద
బౌండరీల మోతతో భయపెట్టిన అభిషేక్‌ను రచిన్ రవీంద్ర ఔట్ చేసి కివీస్‌కు తొలి బ్రేకిచ్చాడు. వైడ్ బంతిని ఆడబోయిన అభి.. వికెట్ కీపర్ సీఫర్ట్ చేతికి చిక్కాడు. ఆతర్వాత ఇషాన్ కిషన్(54) డబుల్స్ తీయగగా 7.2 ఓవర్లకే స్కోర్ వంద దాటింది. శాంట్నర్ ఓవర్లో సింగిల్లతో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీకి చేరువైన శాంసన్. ఫెర్గూసన్ ఓవర్లో రెండు సిక్సర్లతో స్కోర్ 150 మార్క్ అందుకుంది.
Innings Break!
A fiery batting performance takes #TeamIndia to a massive total in the #T20WorldCup #Final 👏🙌
Over to our bowlers! ⌛
Updates ▶️ https://t.co/5LXBod8bl1#MenInBlue | #INDvNZ️ pic.twitter.com/uqNTlARfK7
— BCCI (@BCCI) March 8, 2026
మరో ఎండ్‌లో ఇషాన్ సైతం దంచేయగా.. రవీంద్ర ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన సంజూ.. నీషమ్(3-46) ఒకే ఓవర్లో శాంసన్, ఇషాన్‌లను ఔట్ చేయడంతో బ్లాక్ క్యాప్స్ ఊపిరిపీల్చుకుంది. చివరి బంతికి భారత అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ.. బౌండరీ వద్ద రచిన్ స్టన్నింగ్ క్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(18) ఔటైనా.. శివం దూబే(26 నాటౌట్), తిలక్ వర్మ( 8నాటౌట్)లు ధనాధన్ ఆడారు. నీషం వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో దూబే.. 4, 6, 6..4 రాబట్టగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 255 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

