Poornachar | మీ ఓటు అవార్డు తెచ్చిపెడుతుంది: సైమా లిరిసిస్ట్ కంటెస్టెడ్ పూర్ణాచారి
Poornachar | మీ ఓటు నాకే వేయాలి. అది నాకు అవార్డు తెచ్చిపెడుతుంది అని అభిమానులను కోరుతున్నారు కోర్టు సినిమాలో ‘కథలెన్నో చెప్పారు’ పాట రాసిన పూర్ణాచారి. అతను ‘సైమా’ కంటెస్టెడ్లో లిరిసిస్ట్‌గా పోటీపడుతున్నారు.
Poornachar | హనుమకొండ చౌరస్తా: జాతీయ అవార్డు విజేతల్లో పాటల రచయితలది ప్రత్యేక స్థానం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన భావాలు, అర్ధవంతమైన పదాలతో పాటలను సృష్టించిన చల్లూరి పూర్ణాచారి ఇప్పుడు ఉత్తమ గేయ రచయిత (Best Lyricist)గా పోటీ పడుతున్నారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ (SIIMA) ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ రెండోవారంలో జరగనున్న సైమా అవార్డుల కోసం ఉత్తమ తెలుగు గేయ రచయితలనామినేషన్ల జాబితాను ప్రకటించింది. దీనిలో ఐదుగురిని ఎంపిక చేయగా కోర్టు సినిమాలోని ‘కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో’ అనే పాట రాసిన పూర్ణాచారి ఎంపికయ్యారు.
పూర్ణాచారి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా బండారుపల్లికి చెందినవారు. చలనచిత్ర పరిశ్రమలో అందించే జాతీయస్థాయి సినీ అవార్డు అందుకునేందుకు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. చిన్ననాటి నుంచే ఇంట్లో సాహిత్యం, తెలుగు పాటలు, చిందుయక్షానం వింటూ గేయ రచయితగా మారారు. 14 సంవత్సరాల తన ప్రయాణం జోరు సినిమా నుంచి మొదలై ప్రేమమ్-2016తో మంచి బ్రేక్ వచ్చింది. దాస్ కా దమ్కీ(ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల), కిష్కిందపురి, ప్రేమమ్, సవారి మొదలైన సుమారు 200 సినిమాల్లో 600కు పైగా పాటలు రాశారు. ఇప్పటికే తెలంగాణ సింగిడి అవార్డు, సినారె, వంశీ ఫిల్మ్ అవార్డు, మ్యూజిక్ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ బిడ్డగా ప్రజలందరూ అతనికి మద్దతు తెలపాలని కోరుతున్నారు. ఓటు వేసి బెస్ట్ లిరిసిస్ట్‌గా గెలిపించాలని పూర్ణాచారి అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది ఓటువేసి మద్దతు తెలుపుతున్నారు. మంత్రి సీతక్క కూడా మద్దతు ప్రకటించారు.

Poornachary Nani
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

