రాయ్పూర్: ప్రభుత్వ పాఠశాలల్లో వీధి కుక్కలను నియంత్రించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. స్కూల్ ప్రాంగణంలో కుక్కలు కనిపిస్తే వాటిని పట్టించేందుకు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. (Track Stray Dogs At Schools) అయితే ఈ ఆదేశం తమను అవమానించడమేనంటూ టీచర్స్ సంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. నవంబర్ 20న ఛత్తీస్గఢ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, చుట్టుపక్కల తిరుగుతున్న వీధి కుక్కలపై నిఘా ఉంచాలని ఉపాధ్యాయులను ఆదేశించింది. ఆ కుక్కల గురించి స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ లేదా డాగ్ క్యాచర్ నోడల్ అధికారికి సమాచారం ఇవ్వాలని పేర్కొంది. అలాగే స్కూల్ ఆవరణలోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించింది.
కాగా, ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతర్యం వ్యక్తం చేశాయి. ఇప్పటికే విద్యాతేర పనుల భారంతో సతమతమవుతున్న టీచర్లకు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం వారి గౌరవాన్ని మరింత దిగజార్చడమేనని మండిపడ్డాయి. కుక్కలను పట్టుకునే బాధ్యత తమకు అప్పగించడం ఆమోదయోగ్యం కాదని ప్రధానోపాధ్యాయులు విమర్శించారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read:
Pankaja Munde’s Key Aide Arrested | భార్య ఆత్మహత్య.. మంత్రి కీలక సహాయకుడు అరెస్ట్
2 brides in a month | ఒకే నెలలో ఇద్దరు మహిళలను పెళ్లాడిన వ్యక్తి.. అరెస్ట్ చేయించిన భార్యలు
Watch: పెళ్లిలో వ్యక్తి చెంపపై కొట్టిన డ్యాన్సర్.. తర్వాత ఏం జరిగిందంటే?