చండీగఢ్: ఒక వ్యక్తి పెళ్లిలో గందరగోళం చెలరేగింది. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్యాన్సర్ పట్ల ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ అతడి చెంపపై కొట్టింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వ్యక్తులు కొట్టుకున్నారు. (Fight Breaks Out At Wedding) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలోని నూహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 16న పచ్గావ్ గ్రామానికి చెందిన వ్యక్తి పెళ్లి జరిగింది. ఆదివారం రాత్రి వివాహానికి ముందు వరుడి కుటుంబం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది.
కాగా, ఒక మహిళ డ్యాన్స్ చేస్తుండగా వరుడి బంధువైన వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. ఆ మహిళ అతడి చెంపపై కొట్టగా ఆ వ్యక్తి తిరిగి ఆమెను కొట్టాడు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వ్యక్తులు కొట్టుకున్నారు. కొందరు వేదికపైకి ఎక్కి ప్రదర్శకారులపై దాడి చేయగా వారు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు పెళ్లిలో జరిగిన ఈ కోట్లాటకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. అయితే ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
हवस से भरी हुई जाहिल भीड़!⚠️🚨
हरियाणा के मेवात में मोहम्मद एजाज नामक लड़के के प्री-वेडिंग फंक्शन में दूल्हे के चाचा ने महिला डांसर की छाती में नोट ठूंसकर उसके साथ छेड़खानी की। महिला स्वाभिमानी थी, उसने ठरकी चचा को जोरदार थप्पड़ जड़ दिया।
इसके बाद वहां मौजूद जाहिल भीड़ की… pic.twitter.com/uv9TIMgnwC
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) November 19, 2025
Also Read:
2 brides in a month | ఒకే నెలలో ఇద్దరు మహిళలను పెళ్లాడిన వ్యక్తి.. అరెస్ట్ చేయించిన భార్యలు
Nitish Kumar’s son Nishant | సీఎం నితీశ్ ప్రమాణ స్వీకారంలో.. ఆకట్టుకున్న కుమారుడు నిశాంత్