పాట్నా: బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ హాజరైన ఈ కార్యక్రమంలో నితీశ్ కుమార్ ఏకైక కుమారుడు నిశాంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. (Nitish Kumar’s son Nishant) తండ్రికి ఆయన అభినందనలు తెలిపారు. ‘నా తండ్రి పదోసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను అభినందిస్తున్నా. మాకు విజయాన్ని అందించిన ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని మీడియాతో అన్నారు. అలాగే సొంత పార్టీ జేడీ(యూ) నేతలు, కార్యకర్తలతోపాటు బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.
కాగా, రాజకీయ ప్రవేశంపై నిశాంత్‌ను మీడియా ప్రశ్నించగా నవ్వుతూ సమాధానం దాటవేశారు. మెస్రాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్)లో చదివిన ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్. మీడియాకు దూరంగా ఉండే నితీశ్ ఏకైక కుమారుడు ఎనిమిదేళ్ల కిందట రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని తెలిపారు. రాజకీయాలపై ఎలాంటి పరిజ్ఞానం కూడా లేదని చెప్పారు. ‘నా మొదటి ప్రేమ ఆధ్యాత్మికత. ప్రస్తుతానికి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతున్నా’ అని గతంలో ఆయన అన్నారు.
అయితే ఇటీవల తండ్రి నితీశ్ కుమార్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో కుమారుడు నిశాంత్ కనిపించారు. జేడీ(యూ)కు సంబంధించిన రాజకీయ చర్చల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ రాజకీయ వారసత్వాన్ని నిశాంత్ అందిపుచ్చుకుంటారా? అన్న దానిపై చర్చ జరుగుతున్నది.
Father and Son in playful moment after After the oath-taking ceremony, CM Nitish Kumar met his son Nishant in quite this style! pic.twitter.com/Brg4xwhvbG
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) November 20, 2025
#WATCH | Patna | As Nitish Kumar is set to return as Bihar CM for the 10th time, his son Nishant Kumar says, “I congratulate my father for taking the oath as the CM the 10th time. The public gave us more than expected. I thank and also congratulate the public.” pic.twitter.com/Xx2czQMuAb
— ANI (@ANI) November 20, 2025
Also Read:
School Boy Dies By Suicide | ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక.. స్కూల్ విద్యార్థి ఆత్మహత్య
Car Collides With Tipper Truck | కారు, టిప్పర్ లారీ ఢీ.. మహిళతో సహా ముగ్గురు మృతి