Rahul Gandhi | ప్రధాని మోదీ వ్యక్తిగత ఇమేజ్ కోసం దేశ ప్రయోజనాలు తాకట్టు : రాహుల్‌గాంధీ
Rahul Gandhi | ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బకొడుతుందని ఆయన చెప్పారు.
Rahul Gandhi : ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బకొడుతుందని ఆయన చెప్పారు. ఈ వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ.. అమెరికా ఒత్తిడికి పూర్తిగా లొంగిపోయారని అన్నారు. మంగళవారం భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘మహా కిసాన్ సమ్మేళన్ (Maha Kisan Sammelan)’లో రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో భారత్ ఆ దేశం నుంచి రూ.9 లక్షల కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని రాహుల్‌గాంధీ చెప్పారు. దానివల్ల దేశీయ పరిశ్రమలు, ముఖ్యంగా వ్యవసాయ, టెక్స్టైల్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. టెక్స్టైల్ రంగాన్ని ఇప్పటికే నాశనం చేశారని విమర్శించారు. బంగ్లాదేశ్‌కు సున్నా శాతం సుంకాలు ఇచ్చిన అమెరికా.. తమ నుంచి పత్తి కొనాలంటూ భారత్‌పై ఒత్తిడి తెస్తోందని రాహుల్ విమర్శించారు.
ప్రధాని మోదీ తన రాజకీయ భవిష్యత్తును, వ్యక్తిగత ఇమేజ్ను కాపాడుకోవడానికే ఆమెరికా ఒత్తిడికి తలొగ్గారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి ఈ మెయిళ్లు, వీడియోలతో సహా కీలక ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఇంకా బయటపెట్టలేదని అన్నారు. కాగా, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తలపెట్టిన కిసాన్ సమ్మేళనాలకు ఈ సభతో శ్రీకారం చుట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
ట్రెండింగ్ వార్తలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్

