ముంబై: ఒక విద్యార్థి లోకల్ ట్రైన్లో కాలేజీకి బయలుదేరాడు. అతడు హిందీలో మాట్లాడటంపై కొందరు వ్యక్తులు గొడవపడ్డారు. మరాఠీలో మాట్లాడకపోవడంపై ఆ యువకుడిని కొట్టారు. తీవ్ర మనస్థాపం చెందిన ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Student Suicide Over Hindi-Marathi Row) మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. కళ్యాణ్‌లో నివసించే 19 ఏళ్ల అర్నవ్ ఖైరే, ములుండ్‌లోని కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రోజూ లోకల్ ట్రైన్లో ప్రయాణించి కాలేజీకి వెళ్లి వస్తున్నాడు.
కాగా, నవంబర్ 18న కాలేజీకి వెళ్లేందుకు లోకల్ ట్రైన్లో అర్నవ్ ప్రయాణించాడు. ఆ యువకుడు హిందీలో మాట్లాడటంపై ఐదుగురు వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. అతడితో గొడవకు దిగారు. మరాఠీలో మాట్లాడనందుకు ఆ స్టూడెంట్ను కొట్టారు.
అయితే ఈ సంఘటనతో మనస్థాపం చెందిన అర్నవ్ థానే స్టేషన్లో రైలు దిగాడు. మరో లోకల్ ట్రైన్లో ములుండ్ చేరుకున్నాడు. తండ్రి జితేంద్రకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఆ తర్వాత లోకల్ ట్రైన్లో ఇంటికి తిరిగి వచ్చాడు. మరోసారి తండ్రి జితేంద్రతో ఫోన్లో మాట్లాడాడు. జరిగిన సంఘటన వల్ల తనకు చాలా ఆందోళనగా ఉన్నదని అన్నాడు.
మరోవైపు అర్నవ్ తండ్రి జితేంద్ర సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చాడు. ఇంటి డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండటం చూసి కంగారుపడ్డాడు. పొరుగువారితో కలిసి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూశాడు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కుమారుడు అర్నవ్‌ను చూసి తండ్రి షాక్ అయ్యాడు. ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తండ్రి జితేంద్ర ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేదుకు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read:
School Boy Dies By Suicide | ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక.. స్కూల్ విద్యార్థి ఆత్మహత్య
Car Collides With Tipper Truck | కారు, టిప్పర్ లారీ ఢీ.. మహిళతో సహా ముగ్గురు మృతి
2 brides in a month | ఒకే నెలలో ఇద్దరు మహిళలను పెళ్లాడిన వ్యక్తి.. అరెస్ట్ చేయించిన భార్యలు