బెంగళూరు: మెడికల్ కాలేజీలో జరిగిన అంతర్గత పరీక్షలో ఒక వైద్య విద్యార్థి కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. దీంతో ప్రొఫెసర్ అతడి పేపర్‌ను తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఆ స్టూడెంట్ ప్రొఫెసర్‌పై దాడి చేశాడు. (Medical Student Attacks Professor) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 18న డాక్టర్ మలకారెడ్డి హోమియోపతి కాలేజీలో ఇంటర్నల్ ఎగ్జామ్ నిర్వహించారు.
కాగా, షహబాజ్ అనే వైద్య విద్యార్థి మొబైల్ ఫోన్ చూసి సమాధానాలు రాస్తున్నాడు. ఇన్విజిలేటర్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరాజ్‌కుమార్ ఇది గమనించారు. పరీక్షలో కాపీకి పాల్పడిన షహబాబ్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి సమాధాన పత్రాలను లాక్కున్నారు. ఆ స్టూడెంట్ను బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు.
మరోవైపు ఆగ్రహించిన విద్యార్థి షహబాజ్ హింసాత్మకంగా ప్రవర్తించాడు. ప్రొఫెసర్‌పై దాడికి ప్రయత్నించగా తొలుత విద్యార్థులు అడ్డుకున్నారు. అయితే పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్తున్న అతడు మళ్లీ వెనక్కి వచ్చాడు. ప్రొఫెసర్ శివరాజ్‌కుమార్‌పై దాడి చేశాడు.
కాగా, హోమియోపతి కాలేజీ యాజమాన్యం ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యార్థి షహబాజ్ ప్రవర్తన గురించి అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అలాగే భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షల నుంచి అతడ్ని నిషేధించాలని నిర్ణయించింది.
అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరాజ్‌కుమార్ ఈ దాడిపై ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా, ఎగ్జామ్ హాల్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Kalaburagi: Student Assaults Assistant Professor After Being Caught Cheating During Exam
Kalaburagi
A disturbing incident of violence against an educator has been reported from a local homeopathy college in #Kalaburagi, where a student allegedly assaulted an assistant… pic.twitter.com/781wfI6mVp
— Yasir Mushtaq (@path2shah) February 20, 2026
Also Read:
Watch: సిగరెట్ కాల్చవద్దన్నందుకు.. బైక్ పెట్రోల్ ట్యాంకులోకి లైటర్ విసిరిన వ్యక్తి
Car Truck Collision | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఏడుగురు మృతి
activist arrested | ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యపై పిటిషన్ వేసిన.. సామాజిక కార్యకర్త అరెస్ట్
Man Kills Brother for Tea | టీ కోసం అన్నను నిద్ర లేపిన తమ్ముడు.. గొడవ జరుగడంతో అన్నను హత్య