రాయ్‌పూర్: పెట్రోల్ బంకు వద్ద సిగరెట్ కాల్చేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే సిగరెట్ కాల్చవద్దని పెట్రోల్ బంకు సిబ్బంది కోరాడు. ఆగ్రహించిన ఆ వ్యక్తి పెట్రోల్ నింపుతున్న బైక్ ట్యాంకులోకి లైటర్ విసిరాడు. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. (Man Throws Lighter Into Fuel Tank) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 18న రాత్రి 7:40 గంటల సమయంలో ఉర్లా ప్రాంతంలోని పెట్రోల్ బంకు వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు.
కాగా, ఆ బైక్‌లో పెట్రోల్ నింపుతుండగా వెనుక కూర్చొన్న వ్యక్తి కిందకు దిగి సిగరెట్ వెలిగించేందుకు ప్రయత్నించాడు. గమనించిన పెట్రోల్ బంకు ఉద్యోగి సిగరెట్ కాల్చవద్దని అతడికి చెప్పాడు. ఆగ్రహించిన ఆ వ్యక్తి పెట్రోల్ నింపుతున్న బైక్ ట్యాంకులోకి లైటర్ విసిరాడు. దీంతో బైక్‌తో పాటు అక్కడ మంటలు ఎగసిపడ్డాయి. పెట్రోల్ బంకు ఉద్యోగి, బైక్‌పై ఉన్న వ్యక్తి భయంతో అక్కడి నుంచి పరుగెత్తారు.
మరోవైపు పెట్రోల్ బంకు ఉద్యోగి ఆ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఇంధనం సరఫరా నిలిపివేశాడు. అగ్నిమాపక పరికరంతో మంటలను ఆర్పివేశాడు. ఇంతలో పారిపోతున్న ఆ ఇద్దరు వ్యక్తులను బంకు సిబ్బంది పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత ఆ ఇద్దరిని అప్పగించారు.
ఆ ఇద్దరు వ్యక్తులను ధర్మేంద్ర సింగ్, ఇమ్రాన్ ఖురైషిగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేశారు. వారి బైక్‌తో పాటు లైటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, ఆ పెట్రోల్ బంకు వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man lights fire at petrol pump in Raipur. Staff rush to stop disaster…
🚨 CCTV footage shows a man setting fire near a petrol pump nozzle at Sangeeta Fuels, Raipur, Chhattisgarh. Staff acted fast to prevent disaster. Both accused arrested. pic.twitter.com/3r6ey6uFtU— contentkikamii (@contentkikamii) February 20, 2026
Also Read:
activist arrested | ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యపై పిటిషన్ వేసిన.. సామాజిక కార్యకర్త అరెస్ట్
Man Kills Brother for Tea | టీ కోసం అన్నను నిద్ర లేపిన తమ్ముడు.. గొడవ జరుగడంతో అన్నను హత్య
Scrap Dealer Returns Gold | రూ.15 లక్షల విలువైన నగలు పొరపాటున పారవేత.. తిరిగి ఇచ్చిన స్క్రాప్ డీలర్