చండీగఢ్: ఒక కుటుంబం రూ.15 లక్షల విలువైన నగల బాక్స్‌ను పాత వస్తువుల్లో దాచింది. ఇంటి శుభ్రం నేపథ్యంలో పాత వస్తువులను స్క్రాప్ డీలర్‌కు అమ్మారు. అందులో ఉన్న నగల బాక్స్ కూడా పాత వస్తువులతో పాటు స్క్రాప్ డీలర్ తీసుకుపోయాడు. అయితే ఆరు నెలల తర్వాత బయటపడిన ఆ నగల పెట్టె ఆ కుటుంబానికి తిరిగి దక్కింది. (Scrap Dealer Returns Gold) హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. 2025 జనవరిలో అశోక్ శర్మ కుటుంబం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లింది. ఈ నేపథ్యంలో దొంగల భయం వల్ల ఇంట్లో ఉన్న రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పాత పెట్టెలో ప్యాక్ చేశారు. పాత వస్తువులు ఉన్న సంచిలో దానిని దాచారు.
కాగా, కుంభమేళా నుంచి తిరిగి వచ్చిన తర్వాత దాచిన నగల గురించి ఆ కుటుంబం మరిచిపోయింది. పది నెలల తర్వాత అక్టోబర్‌లో దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రం చేశారు. ఈ నేపథ్యంలో ఇంట్లోని పాత వస్తువులను స్క్రాప్ డీలర్‌కు అమ్మారు. దీంతో పాత వస్తువుల సంచిలో దాచిన నగల బాక్స్‌ను కూడా వాటితోపాటు స్క్రాప్ డీలర్ పట్టుకుపోయాడు.
మరోవైపు దీపావళి రోజున పూజ సందర్భంగా బంగారు ఆభరణాలను పాత వస్తువుల్లో దాచినట్లు ఆ కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. అయితే పొరపాటున ఆ నగల బాక్స్‌ను పాత వస్తువులతో కలిపి స్క్రాప్ డీలర్‌కు ఇచ్చేసినట్లు తెలుసుకున్నారు. స్క్రాప్ డీలర్ హాజీ అక్తర్ ఖాన్ షాపు వద్దకు అశోక్ శర్మ వెళ్లాడు. నగలు దాచిన పాత పెట్టె గురించి చెప్పి అక్కడ అంతా వెతికాడు. కనిపించకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశ చెందారు. ఆ బంగారు నగలపై వారు ఆశ వదులుకున్నారు.
అయితే ఆరు నెలల తర్వాత బంగారు నగలు దాచిన పాత పెట్టెను హాజీ అక్తర్ ఖాన్ తన స్క్రాప్ షాప్‌లో గుర్తించాడు. దాని కోసం అశోక్ శర్మ తన షాపు వద్దకు వచ్చిన సంగతిని గుర్తు చేసుకున్నాడు. దీంతో తన నిజాయితీని చాటుకున్నాడు. ఏసీపీ జితేష్ మల్హోత్రా సమక్షంలో రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అశోక్ శర్మ కుటుంబానికి అప్పగించాడు. లక్షల విలువైన బంగారు నగలను సొంతం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎంతో నిజాయితీగా తిరిగి ఇచ్చిన హాజీ అక్తర్ ఖాన్‌ను అందరూ ప్రశంసించారు.
Scrap Dealer Returns ₹15 Lakh Worth of Gold After 6 Months Faith in Honesty Restored ✨
A heartwarming story from Faridabad, Haryana, has strengthened our belief in humanity and integrity.
A scrap dealer, Khan Sahab, set a powerful example of honesty by returning a family’s… pic.twitter.com/Kx1kK7wgWw— The Nalanda Index (@Nalanda_index) February 19, 2026
Also Read:
Watch: బురఖా ధరించి లేడీస్ కోచ్‌లో ప్రయాణించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భర్తను మెడ వరకు పూడ్చిపెట్టిన భార్య.. శివలింగం మాదిరిగా తలపై అభిషేకం