ముంబై: ఒక వ్యక్తి బురఖా ధరించాడు. లోకల్ ట్రైన్‌లోని మహిళా కోచ్‌లో అతడు ప్రయాణించాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతడి ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశారు. (Man In Burqa) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 6న బురఖా ధరించిన ఒక వ్యక్తి ఘట్కోపర్ రైల్వే స్టేషన్లో సబర్బన్ రైలు ఎక్కాడు. మహిళల కంపార్ట్మెంట్లో ప్రయాణించాడు. దీనిని గుర్తించిన కొందరు మహిళలు అతడ్ని నిలదీశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఏ మహిళా కూడా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్పందించారు. పలు రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బురఖా ధరించిన ఆ వ్యక్తిని 57 ఏళ్ల షేక్ అల్తాఫ్ హుస్సేన్ ఇషాక్‌గా గుర్తించారు. నాసిక్‌లోని ముక్తిధామ్ ప్రాంతంలో అతడు నివసిస్తున్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఇషాక్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలుసుకున్నారు. సంభాజీ నగర్‌లోని మానసిక ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. అతడి మానసిక పరిస్థితి కారణంగా అప్పుడప్పుడు బురఖా ధరించి తిరుగుతుంటాడని అతడి కుటుంబం ద్వారా తెలిసిందని పోలీస్ అధికారి వెల్లడించారు.
ये वीडियो मुंबई से सामने आया है, जहां लोकल ट्रेन में महिलाओं के लिए आरक्षित डिब्बे में बुर्का पहने एक संदिग्ध व्यक्ति चढ़ गया. महिला यात्रियों ने शक होने पर उसे पकड़ लिया और घटना का वीडियो भी रिकॉर्ड किया, जैसे ही शख्स की पोल खुली वह चलती ट्रेन से कूदकर फरार हो गया. #MUMBAI… pic.twitter.com/HFo5CU9IMN
— ABP News (@ABPNews) February 7, 2026
Also Read:
Husband arrested | భార్య ప్రైవేట్ వీడియో లీక్ చేసిన భర్త.. అరెస్ట్ చేసిన పోలీసులు
Woman Appears Exam With Baby | పది రోజుల బిడ్డతో.. 12వ తరగతి పరీక్షకు హాజరైన యువతి
lose eyesight | సర్జరీ తర్వాత చూపు కోల్పోయిన 9 మంది.. ఆసుపత్రి మూసివేత
students slit hands | బ్లేడ్‌తో చేతులపై కోసుకున్న 35 మంది విద్యార్థులు.. పేరెంట్స్ షాక్