ముంబై: ఒక యువతి పది రోజుల బిడ్డతో కలిసి 12వ తరగతి పరీక్షకు హాజరైంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. నవజాత శిశువు కోసం ఉయ్యాల కూడా ఏర్పాటు చేశారు. (Woman Appears Exam With Baby) మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల శీతల్ చంద్రకాంత్ చిట్టే పది రోజుల కిందట నవజాత శిశువుకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 18న ఆ బిడ్డను ఎత్తుకుని 12వ తరగతి పొలిటికల్ సైన్స్ బోర్డు పరీక్షకు ఒంటరిగా హాజరైంది.
కాగా, ఇది గమనించిన పరీక్షల నిర్వాహకులు, అధికారులు శీతల్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఆమె పరీక్ష రాసేందుకు అనుకూలంగా ఒక క్లాస్రూమ్ కేటాయించారు. బిడ్డ విశ్రాంతి కోసం ఒక ఊయల కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు బిడ్డను ప్రసవించిన రెండు రోజులకే ఫిబ్రవరి 10న జరిగిన ఇంగ్లీష్ పరీక్ష కోసం సోదరితో కలిసి శీతల్ హాజరైంది. అయితే ఫిబ్రవరి 18న జరిగిన పరీక్షకు ఆమె వెంట ఎవరూ రాలేదు. భర్త పనికి వెళ్లడంతో తన బిడ్డను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరని శీతల్ తెలిపింది. అందుకే బిడ్డతో కలిసి పరీక్షకు హాజరైనట్లు చెప్పింది. అయితే పెళ్లైనప్పటికీ చదువు కొనసాగింపు పట్ల ఆమె దృఢ సంకల్పాన్ని అధికారులు ప్రశంసించారు.
Also Read:
students slit hands | బ్లేడ్‌తో చేతులపై కోసుకున్న 35 మంది విద్యార్థులు.. పేరెంట్స్ షాక్
lose eyesight | సర్జరీ తర్వాత చూపు కోల్పోయిన 9 మంది.. ఆసుపత్రి మూసివేత
Electricity, Water Supply Cut | దళిత వాడలో విద్యుత్, తాగునీటి సరఫరా బంద్.. కుల వివక్షపై ఆరోపణలు