Out Sourcing Employees | కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు తీసేసి బతుకు భారమయ్యేలా చేసిందని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కోల్పోయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం కోల్పోయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మాట్లాడుతూ.. నా పేరు రమేశ్.. మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం. 33 జిల్లాల నుంచి 632 మంది కంప్యూటర్ ఆపరేటర్లం ఇక్కడకు వచ్చాం. తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీవో, కలెక్టర్ ఆఫీసుల్లో పనిచేస్తున్నం. ఇక్కడ పనిచేస్తున్నవాళ్లంతా దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల సర్వీస్ ఉన్నవాళ్లే. ప్రభుత్వం నడుస్తుందంటే.. ఎమ్మార్వో ఆఫీస్లో పనులు నడుస్తున్నాయంటే 99 శాతం మావల్లనే. మేం లేనిది ఏ రిపోర్ట్లు చేయరు. ఇలా పనిచేసుకుంటూ చేసుకుంటూ ఒక్కొక్కరు 45-50 సంవత్సరాల వయస్సు దాకా వచ్చారు. ఇందులోమహిళలు, దివ్యాంగులు ఇన్ని రోజులుగా పనిచేసుకుంటూ వస్తే మమ్మల్ని అకారణంగా ఎలాంటి రిమార్క్ లేకున్నా మా సర్వీస్ వద్దని చెప్పి ఉద్యోగాల నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
మా వయసు ఒక్కొకరికి 45, 50 సంవత్సరాలు ఉంది.. ఇప్పుడు మాకు బయట ఉద్యోగాలు కూడా ఇవ్వరు. ఇన్నిరోజులు సేవలు తీసుకొని అకారణంగా మా ఉద్యోగాలు తీసేశారు. మాకు ఉద్యోగం లేకపోవడం వల్ల ఊర్లో కిరాణా షాపులో సరుకులు ఉద్దర కూడా ఇవ్వడం లేదని సదరు ఉద్యోగి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.
మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నా ఉద్యోగం పోయింది.. మళ్లీ తీసుకోవాలని కోరుతున్నామంటూ ఓ దివ్యాంగుడు కన్నీటి పర్యంతమయ్యాడు.
20 ఏళ్ల నుండి రెవెన్యూ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నా. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని చెప్పి, ఇప్పుడు మా ఉద్యోగాలే లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రెండేళ్లలో జీతాలు సరిగ్గా ఇవ్వలేదు, ఇప్పుడు ఉద్యోగాలే లేకుండా చేశారన్నాడు.
మా వయసు ఒక్కొకరికి 45, 50 సంవత్సరాలు ఉంది.. ఇప్పుడు మాకు బయట ఉద్యోగాలు కూడా ఇవ్వరు
ఇన్నిరోజులు సేవలు తీసుకొని అకారణంగా మా ఉద్యోగాలు తీసేశారు
మాకు ఉద్యోగం లేకపోవడం వల్ల ఊర్లో కిరాణా షాపులో సరుకులు ఉద్దర కూడా ఇవ్వడం లేదు
– ఉద్యోగం కోల్పోయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి https://t.co/oy5Ydj2vYQ pic.twitter.com/lPtsWwTT1M
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026
కాంగ్రెస్ ప్రభుత్వంలో తన ఉద్యోగం పోయిందని కన్నీళ్లు పెట్టుకున్న వికలాంగుడు
20 ఏళ్ల నుండి రెవెన్యూ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని చెప్పి, ఇప్పుడు మా ఉద్యోగాలే లేకుండా చేశాడు
ఈ రెండేళ్లలో జీతాలు సరిగ్గా… https://t.co/LE9PM4702Y pic.twitter.com/Ah9jwpH2Oh
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2026