ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
ACB Raid | జోగులాంబ గద్వాల ( Gadwal ) జిల్లా విద్యుత్ సర్కిల్ లో అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రమేష్ బాబు లంచం తీసుకుంటూ పట్టు పడ్డారు.
గద్వాల : జోగులాంబ గద్వాల ( Gadwal ) జిల్లా విద్యుత్ సర్కిల్ లో అసిస్టెంట్ డిప్యూటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రమేష్ బాబు ( ADE Ramesh Babu ) గురువారం సాయంత్రం లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ( ACB DSP Balakrishna ) ఆధ్వర్యంలోని బృందానికి పట్టు పడ్డారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ చేపట్టిన పనుల బిల్లులు చెల్లించడంలో ఏడీఈ ఇబ్బందులకు గురిచేశాడు.
డబ్బులు ఇస్తే తప్ప బిల్లులు చేయనని తెగేసి చెప్పడంతో విసిగి చెందిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను కలిశారు. సాయంత్రం కార్యాలయానికి వచ్చిన ఏడీఈ లంచం డబ్బును కారులో పెట్టమని కాంట్రాక్టర్‌కు ఆదేశించడంతో రూ.60 వేల నగదును కారులో పెట్టాడు. ఏడీఈ కారులో బయలు దేరుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విద్యుత్ కాంట్రాక్టర్ల కు బిల్లులు చెల్లింపు కోసం గద్వాలలో ఇంజనీరింగ్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి . ఏఈడీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ACB net
- ADE caught
- bribe
- Contractor
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ ఆనందదాయకం : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Niranjan Reddy | రైతుల పట్ల నిర్లక్ష్యం..సమ్మిట్ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Manifesto | నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల భృతి, రైతులకు రుణమాఫీ.. అఖిలేష్ యాదవ్ ఎన్నికల మేనిఫెస్టో..!
CM Meeting | అచ్చంపేట సీఎం సభలో మహిళల నిర్బంధం..కూలిన గేట్లు, ఫ్లెక్సీలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

