Niranjan Reddy | రైతుల పట్ల నిర్లక్ష్యం..సమ్మిట్ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతూ సమ్మిట్ ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
మహబూబ్ నగర్ : రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతూ సమ్మిట్ ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy) ఆరోపించారు. మహబూబ్ నగర్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి, కొట్టుకుపోయి రైతులు హరిగోస పడుతున్న పట్టించుకునే నాథుడు కూడా లేరని తీవ్రంగా విమర్శించారు.
ప్రభుత్వం సాగు నీళ్లు, కరెంటు ఇవ్వకపోయినా,రైతు బంధు ఏగ్గొట్టినా ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి కూడా భద్రత కల్పించలేని ఆసమర్ధుడు రేవంత్ రెడ్డి అని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా నేటికి ఒక్క బస్తా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ధాన్యం నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండిన పంటలకు,అకాల వర్షాల వల్ల తడిసిన కొట్టుకుపోయిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించి రైతులలో ఆత్మస్థైర్యం నింపాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట సభలో 50కోట్లు ఖర్చుపెట్టి కేసీఆర్, హరీష్ ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు ప్రాజెక్టులను ఎండబెట్టి ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో వాకిటి శ్రీధర్, నందిమల్లఅశోక్, మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్, కె.మాణిక్యం, గంధం పరంజ్యోతి, రఘువర్ధన్ రెడ్డి, వేణు గోపాల్ నాయుడు, ధర్మా నాయక్, దేవర్ల నరసింహ, సునీల్ వాల్మీకి, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, సయ్యద్ జమీల్, మందరాము, బాబు నాయక్, మర్రికుంట శ్రీను, అలీం, ఖాదర్శా, వజ్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | రైతుల పట్ల నిర్లక్ష్యం..సమ్మిట్ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Manifesto | నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల భృతి, రైతులకు రుణమాఫీ.. అఖిలేష్ యాదవ్ ఎన్నికల మేనిఫెస్టో..!
CM Meeting | అచ్చంపేట సీఎం సభలో మహిళల నిర్బంధం..కూలిన గేట్లు, ఫ్లెక్సీలు
బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు గోపాల్ గౌడ్ మానవత్వం
‘ఆర్భాటాలు తప్ప ఆచరణాలేని కాంగ్రెస్ ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

