‘ఆర్భాటాలు తప్ప ఆచరణాలేని కాంగ్రెస్ ప్రభుత్వం’
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పధకం ప్రచార అర్భాటమే తప్ప ఆచరణలో శూన్యమని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
తుంగతుర్తి, నవంబర్ 26 : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పధకం ప్రచార అర్భాటమే తప్ప ఆచరణలో శూన్యమని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన రైతు బీమా వల్ల భూమి ఉన్న రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందేవన్నారు. ఈ ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీమ్ వల్ల ఒక రేషన్ కార్డు కలిగిన ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కరికి మాత్రమే అవకాశం కలిగే పరిస్థితి ఉందన్నారు. 18 నుండి 59 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు ఒకే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి స్కీమ్ వర్తించే అవకాశం ఉండాలని, రేషన్ కార్డు లేక పోయినా భూమి పాస్ బుక్ ఉంటే కూడా స్కీమ్ వర్తించేలా మార్పులు, చేర్పులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత మూడేండ్లలో ఎన్నో పధకాల పేరుతో ఎన్నో దరఖాస్థులు తీసుకున్నారని ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తునికి సాయిలు గౌడ్, మట్టిపెల్లి వెంకట్, అంగోతు వీరు నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఆర్భాటాలు తప్ప ఆచరణాలేని కాంగ్రెస్ ప్రభుత్వం’
Eyes Health | వాయు కాలుష్యంతో కళ్లపై తీవ్ర ప్రభావం.. జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలే..
Anjeer fruit | తరచూ అంజీరా పండ్లను తింటే ఆ అనారోగ్య సమస్యలన్నీ దూరం.. అవేంటంటే..!
ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులుగా కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్
అమృత్ సరోవర్ చెరువుల వద్ద ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

