ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులుగా కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్
కార్మిక హక్కుల సాధనకు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జాతీయ మహాసభల స్ఫూర్తితో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఏఐటీయూసీ జాతీయ సమితి నూతన సభ్యులు కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో...
రుద్రంపూర్, నవంబర్ 26 : కార్మిక హక్కుల సాధనకు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జాతీయ మహాసభల స్ఫూర్తితో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఏఐటీయూసీ జాతీయ సమితి నూతన సభ్యులు కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఐదు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ జాతీయ మహాసభలు గురువారం ముగిశాయి. ఈ మహాసభల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు కంచర్ల జమలయ్య జాతీయ సమితి సభ్యుడిగా ఎన్నికవగా, జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ రెండోసారి జాతీయ సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ మహాసభలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతమయ్యాయని, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కీలక తీర్మానాలు చేశామని తెలిపారు. తమ ఎంపికకు సహకరించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి ఎన్నిక పట్ల జిల్లాలోని ఏఐటీయూసీ అనుబంధ సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులుగా కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్
అమృత్ సరోవర్ చెరువుల వద్ద ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
Fishermen Safe | ఏడుగురు మత్స్యకారులు సురక్షితం.. ఒడిస్సాకు చేరుకున్నట్లు గుర్తింపు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ములకలపల్లిలో ఎస్కేఎం ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

