Fishermen Safe | ఏడుగురు మత్స్యకారులు సురక్షితం.. ఒడిస్సాకు చేరుకున్నట్లు గుర్తింపు
Fishermen Safe | ఏపీలోని కాకినాడ సుబ్బంపేట రేవు నుంచి సముద్రపు వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
అమరావతి : ఏపీలోని కాకినాడ ( Kakinada ) సుబ్బంపేట రేవు నుంచి సముద్రపు వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ( Fishermen Safe ) సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వీరంతా ఒడిస్సా ( Odisha ) తీరానికి చేరుకున్నట్లు గుర్తించారు. ఈ మత్స్యకారులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈనెల 11న కాకినాడ జిల్లా యు.కొత్తపి మండలం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఈనెల 14 వరకు ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడిన తరువాత ఇప్పటి వరకు వారి సమాచారం తెలియరాలేదు. గత 15 రోజులుగా వారి ఆచూకీ తెలియాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమైంది.
కాగా బోటు గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, వంగల పుడి అనితా సంబంధిత అధికారులతో మాట్లాడారు. గత మూడురోజులుగా సంబంధిత మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. గురువారం మధ్యాహ్నం మత్స్యకారుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ కలవడంతో వారు ఒడిస్సాలో క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమృత్ సరోవర్ చెరువుల వద్ద ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
Fishermen Safe | ఏడుగురు మత్స్యకారులు సురక్షితం.. ఒడిస్సాకు చేరుకున్నట్లు గుర్తింపు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ములకలపల్లిలో ఎస్కేఎం ధర్నా
Shootball Competition | అంతర్జాతీయ షూట్బాల్ పోటీల్లో తిమ్మకపల్లి క్రీడాకారుడు ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

