Shootball Competition | అంతర్జాతీయ షూట్బాల్ పోటీల్లో తిమ్మకపల్లి క్రీడాకారుడు ప్రతిభ
Shootball Competition | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మకపల్లి గ్రామానికి చెందిన క్రీడా కారుడు మాధ వినయ్ అంతర్జాతీయ స్థాయిలో షూట్బాల్ లో క్రీడా ప్రతిభను చాటుకుని బంగారు పతకం సాధించాడు.
రాయపోల్: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మకపల్లి గ్రామానికి చెందిన క్రీడా కారుడు మాధ వినయ్ ( Madha Vinay ) అంతర్జాతీయ స్థాయిలో షూట్బాల్ ( Shootball Competition ) లో క్రీడా ప్రతిభను చాటుకుని బంగారు పతకం సాధించాడు. నేపాల్‌లోని ( Nepal ) ఖాట్మాండ్ లో ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి.
ఈ పోటీలో ఇండియా, నేపాల్, భూటాన్, శ్రీలంకతో పాటు ఇతర దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత జట్టు తరఫున షూట్బాల్ క్రీడలో ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ సాధించిన మాధ వినయ్‌ను గ్రామస్థులు అభినందించారు.సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగి అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం ఎంతో అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
క్రీడల పట్ల ఆసక్తి, నిరంతర సాధన, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని వినయ్ నిరూపించాడని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, తిమ్మకపల్లి గ్రామానికి మరింత పేరు, ప్రతిష్టను తీసుకురావాలని ఆకాంక్షించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shootball Competition | అంతర్జాతీయ షూట్బాల్ పోటీల్లో తిమ్మకపల్లి క్రీడాకారుడు ప్రతిభ
రాజ్యాంగ రక్షణే అంబేద్కర్‌కు నిజమైన నివాళి : చింతాబాబు మాదిగ
జాతీయ తైక్వాండో పోటీలకు కోచ్ కమ్ మేనేజర్‌గా అంబటి ప్రణీత్
ఈఎల్వీ భాస్కర్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ
Temparature | రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గుతాయన్న భారత వాతావరణ కేంద్రం..!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

