జాతీయ తైక్వాండో పోటీలకు కోచ్ కమ్ మేనేజర్‌గా అంబటి ప్రణీత్
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఈ నెల 26 నుండి 30 వరకు జరిగే 70వ ఎస్జీఎఫ్ఐ (SGFI) అండర్-19 జాతీయ స్థాయి బాలుర, బాలికల తైక్వాండో ఛాంపియన్షిప్ 2026–27లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లకు నల్లగొండకు చెందిన అంబటి ప్రణీత్ కోచ్ కమ్...
నల్లగొండ రూరల్, నవంబర్ 26 : జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఈ నెల 26 నుండి 30 వరకు జరిగే 70వ ఎస్జీఎఫ్ఐ (SGFI) అండర్-19 జాతీయ స్థాయి బాలుర, బాలికల తైక్వాండో ఛాంపియన్షిప్ 2026–27లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లకు నల్లగొండకు చెందిన అంబటి ప్రణీత్ కోచ్ కమ్ మేనేజర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలుర, బాలికల జట్లకు శిక్షణతో పాటు సమన్వయం, మార్గదర్శకత్వం అందించే బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి పతకాలు సాధించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా అంబటి ప్రణీత్ తెలిపారు.
అంబటి ప్రణీత్ బ్లాక్ బెల్ట్ 2వ డాన్‌తో పాటు నేషనల్ రిఫరీగా, తైక్వాండో ఎన్ఎస్ఎన్ఐఎస్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో తైక్వాండో క్రీడాభివృద్ధికి, యువ క్రీడాకారులకు శిక్షణ అందిస్తూ వారి ప్రతిభను వెలికితీసేందుకు ఆయన చేస్తున్న కృషి విశేషం.
తెలంగాణ రాష్ట్ర బాలుర, బాలికల జట్లకు జాతీయ స్థాయి పోటీల్లో కోచ్ కమ్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించడం పట్ల పలువురు క్రీడా ప్రముఖులు, కోచ్‌లు, క్రీడాకారులు, శ్రేయోభిలాషులు అంబటి ప్రణీత్‌కు అభినందనలు తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో తెలంగాణ జట్లు జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జాతీయ తైక్వాండో పోటీలకు కోచ్ కమ్ మేనేజర్‌గా అంబటి ప్రణీత్
ఈఎల్వీ భాస్కర్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ
Temparature | రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గుతాయన్న భారత వాతావరణ కేంద్రం..!
పదో తరగతి మండల టాపర్లకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోత్సాహక చెక్కులు
SP Ashok Kumar | కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి : ఎస్పీ అశోక్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

