ఈఎల్వీ భాస్కర్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ
తమ హక్కుల కోసం ఓబిసిలంతా ఏకం కావాలని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ–చలో రామ్‌లీలా మైదాన్ పేరిట ఓబీసీ హక్కుల కోసం ఈ నెల 28న ఢిల్లీలో మహాధర్న నిర్వహించనున్నారు.
– హక్కుల కోసం ఓబిసిలంతా ఏకం కావాలి
– ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ పిలుపు
చండూరు, నవంబర్ 26 : తమ హక్కుల కోసం ఓబిసిలంతా ఏకం కావాలని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ–చలో రామ్‌లీలా మైదాన్ పేరిట ఓబీసీ హక్కుల కోసం ఈ నెల 28న ఢిల్లీలో మహాధర్న నిర్వహించనున్నారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి మద్దతుగా ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం ఫౌండేషన్ సభ్యులు, ఓబీసీ కార్యకర్తలు, యువత, మహిళలు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, ఓబీసీ సంఘాల ప్రతినిధులు రైల్లో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 2027లో నిర్వహించనున్న కుల గణనలో ఓబీసీలను పూర్తిగా లెక్కించాలని, వారికి సరైన రాజకీయ, విద్యా, ఉపాధి, సంక్షేమ హక్కులు కల్పించాలని కోరుతూ ఈ ప్రదర్శన చేపట్టినట్లు తెలిపారు. ఓబీసీ వర్గాల హక్కుల సాధనకు దేశ వ్యాప్తంగా ఉన్నవారంతా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జన గణనలో అన్ని కులాలకు ప్రత్యేక డ్రాప్‌డౌన్ ఆప్షన్ అమలు చేయాలన్నారు. కుల గణనలో ఓబీసీలను పూర్తిగా గుర్తించి లెక్కించాలన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని సమీక్షించాలని, సీలింగ్ తొలగించే అవకాశం పరిశీలించాలని కోరారు. ఓబీసీల రాజకీయ ప్రాతినిధ్యం, విద్యా, ఉపాధి అవకాశాలను పెంచాలని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎల్వీ భాస్కర్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ
Temparature | రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గుతాయన్న భారత వాతావరణ కేంద్రం..!
పదో తరగతి మండల టాపర్లకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోత్సాహక చెక్కులు
SP Ashok Kumar | కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి : ఎస్పీ అశోక్ కుమార్
ఎంజీయూ అసిస్టెంట్ కంట్రోలర్‌గా డాక్టర్ దోమల రమేశ్
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

