బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు గోపాల్ గౌడ్ మానవత్వం
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడమే నిజమైన మానవత్వమని బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు గోపాల్ గౌడ్ అన్నారు. దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన ఎకుల వెంకటేశ్ (తండ్రి ఎకుల మల్లయ్య) ట్రాక్టర్ ప్రమాదంలో..
– ఆపదలో ఉన్న కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం
దేవరకొండ రూరల్, నవంబర్ 26 : ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడమే నిజమైన మానవత్వమని బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు గోపాల్ గౌడ్ అన్నారు. దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన ఎకుల వెంకటేశ్ (తండ్రి ఎకుల మల్లయ్య) ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిన కుటుంబానికి బొడ్డు గోపాల్ అండగా నిలిచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పిస్తూ రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న బాధిత కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం ఎంతో భరోసానిచ్చింది. కష్టకాలంలో బాధితుల కన్నీటిని తుడవడానికి ముందుకు రావడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో స్పందిస్తూ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బొడ్డు గోపాల్ సేవాభావం పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు కొనియాడారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు గోపాల్ గౌడ్ మానవత్వం
‘ఆర్భాటాలు తప్ప ఆచరణాలేని కాంగ్రెస్ ప్రభుత్వం’
Eyes Health | వాయు కాలుష్యంతో కళ్లపై తీవ్ర ప్రభావం.. జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలే..
Anjeer fruit | తరచూ అంజీరా పండ్లను తింటే ఆ అనారోగ్య సమస్యలన్నీ దూరం.. అవేంటంటే..!
ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులుగా కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

