రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ ఆనందదాయకం : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ఖమ్మం, నవంబర్ 26 : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన మన దేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించబడిన మన రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని అందించిందని ఆయన గుర్తు చేశారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుతున్న మహాగ్రంథం మన రాజ్యాంగమని కొనియాడారు.
ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అనుభవిస్తూనే, రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు రాజ్యాంగ విలువలను, అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పువ్వాడ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పగడాల నాగరాజు, బత్తుల మురళి, వీరునాయక్, దేవభక్తిని కిశోర్, ఆరెంపుల వీరభద్రం, హెచ్చు ప్రసాద్, నెమలి కిశోర్, ఈశ్వర్, మాతంగి అనిల్, సాగర్, వెంకట్, అశోక్, వెంకటేశ్వర్లు, సురేశ్, వీరేందర్, షకీనా పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ ఆనందదాయకం : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Niranjan Reddy | రైతుల పట్ల నిర్లక్ష్యం..సమ్మిట్ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Manifesto | నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల భృతి, రైతులకు రుణమాఫీ.. అఖిలేష్ యాదవ్ ఎన్నికల మేనిఫెస్టో..!
CM Meeting | అచ్చంపేట సీఎం సభలో మహిళల నిర్బంధం..కూలిన గేట్లు, ఫ్లెక్సీలు
బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు గోపాల్ గౌడ్ మానవత్వం
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

