KTR | ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేస్తారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
KTR | బీఆర్ఎస్ నాయకులపై దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని తెలిపారు.
KTR | బీఆర్ఎస్ నాయకులపై దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని తెలిపారు.
హైదరాబాద్‌లో మా యువ నాయకులు బీఆర్ఎస్ యువ నాయకులు మన్నె క్రిషాంక్, ముఠా జైసింహ, జగన్ పాటిమీది, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీశ్ రెడ్డిలపై దాడి చోటుచేసుకోవడం అత్యంత దారుణమని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి పాలనను తలపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమంపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడటం దారుణమని అన్నారు.
రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారంటూ, ఆయన చిత్రపటంతో డిన్నర్ కార్యక్రమం నిర్వహించడం తప్పా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి, అరాచకానికి పరాకాష్ట అని విమర్శించారు. స్వయంగా రాజ్యసభ సభ్యుడే ఈ దాడికి నాయకత్వం వహించి, తన అనుచరులతో దాడులు చేయించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్, పార్టీ యువ నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రశ్నించే గొంతులను అణచివేయడం, నిరసన తెలిపే వారిపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని కేటీఆర్ విమర్శించారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. దాడికి పాల్పడిన వారిపై, దాడికి నాయకత్వం వహించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాపాడాలని కోరారు.
ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా, ఉద్యోగాల గురించి ప్రశ్నించే వారిపై దాడులు చేయడం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా అలవాటైనట్లుందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ అరాచకాన్ని సహించరని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేస్తారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Mens Fitness | పురుషుల ఫిట్నెస్ అంటే కేవలం కండరాలను పెంచుకోవడమే కాదు, ఇవి కూడా..!
Gadwal ADE | కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలు లంచం.. గద్వాల ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

