Gadwal ADE | కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలు లంచం.. గద్వాల ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Gadwal ADE | జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డిప్యూటీ ఇంజినీర్ (ఏడీఈ) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
Gadwal ADE | జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డిప్యూటీ ఇంజినీర్ (ఏడీఈ) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. విద్యుత్ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.60 వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. గురువారం సాయంత్రం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలోని బృందం అతడిని పట్టుకుంది.
గద్వాల విద్యుత్ సర్కిల్లో ఏడీఈగా పనిచేస్తున్న రమేష్ బాబు.. విద్యుత్ శాఖలో చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. డబ్బులు ఇస్తేనే బిల్లులు చేస్తానని చెప్పడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గురువారం ఉదయం నుంచి ఏడీఈ కోసం ఎదురుచూశారు.
సాయంత్రం కార్యాలయానికి వచ్చిన రమేష్ బాబును కాంట్రాక్టర్ కలిశాడు. లంచం డబ్బులు తీసుకొచ్చావా అని అడగ్గా, తీసుకొచ్చానని చెప్పడంతో కారులో పెట్టాలని సూచించాడు. దీంతో కాంట్రాక్టర్ రూ.60 వేల నగదును ఏడీఈ కారులో పెట్టాడు. అనంతరం కారు ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా, అప్పటికే అక్కడ నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. లంచం తీసుకున్న వ్యవహారంపై అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.
గద్వాలలో విద్యుత్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్లను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మంజూరు విషయంలోనూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఏడీఈని పట్టుకోవడంపై రైతులు, విద్యుత్ కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- Acb
- ACB Raid
- Corruption
- gadwal
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadwal ADE | కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలు లంచం.. గద్వాల ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ ఆనందదాయకం : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Niranjan Reddy | రైతుల పట్ల నిర్లక్ష్యం..సమ్మిట్ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

