రాయ్‌పూర్: ప్రభుత్వ స్కూల్‌కు చెందిన విద్యార్థులు బ్లేడ్‌తో తమ చేతి మణికట్టు కోసుకున్నారు. ఒకరిని చూసి మరొకరు దీనిని అనుసరించారు. బాలబాలికలతో సహా 35 మంది స్టూడెంట్స్ చేతులపై కోసుకున్న గాయాలను చూసి వారి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. (students slit hands) ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తారి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దహ్దాహా గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు బ్లేడ్‌తో చేతి మణికట్టుపై కోసుకున్నారు. 6 నుంచి 8 తరగతులకు చెందిన 21 మంది బాలురు, 14 మంది బాలికలు గత నెల రోజులుగా ఒకరి తర్వాత మరొకరు దీనిని అనుసరించారు.
కాగా, ఫిబ్రవరి 13న విద్యార్థుల తల్లిదండ్రులు దీనిని గమనించారు. స్కూల్ లోపల విద్యార్థులకు బ్లేడ్లు ఎలా చేరాయని ప్రశ్నించారు. స్టూడెంట్స్ చేతి మణికట్టుపై బ్లేడ్‌తో కోసుకున్న గాయాలను వారాలపాటు టీచర్లు గమనించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ స్కూల్‌కు ఒక బృందాన్ని పంపారు. విద్యార్థులు బ్లేడ్‌తో తమ చేతులకు గాయం చేసుకోవడంపై దర్యాప్తు చేశారు. స్టూడెంట్స్ తల్లిదండ్రుల మొబైల్ ఫోన్స్ కూడా తనిఖీ చేసినట్లు అధికారి తెలిపారు. గేమింగ్ ఛాలెంజ్, డ్రగ్స్ కోణాలను తోసిపుచ్చారు. ఆ స్టూడెంట్స్‌కు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read:
Villagers Protest | క్వారీ సర్వేపై గ్రామస్తుల నిరసన.. అధికారులపై రాళ్ల దాడి
Watch: భర్తను మెడ వరకు పూడ్చిపెట్టిన భార్య.. శివలింగం మాదిరిగా తలపై అభిషేకం