భోపాల్: క్వారీ కోసం సర్వేతో పాటు నమూనాల సేకరణకు అధికారులు ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు దీనిని వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సర్వేకు వచ్చిన అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అధికారులు తమ వాహనాల్లో అక్కడి నుంచి పారిపోయారు. (Villagers Protest) మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మోగ్రా గ్రామంలో సున్నపురాయి క్వారీ, సిమెంట్ ప్లాంట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.
కాగా, క్వారీ సర్వేతో పాటు సున్నపురాయి నమూనాలు సేకరించేందుకు డ్రిల్లింగ్ యంత్రాలతో అధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు. తొమ్మిది పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్ బలగాలను అక్కడ మోహరించారు. అయితే క్వారీని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మహిళలతో సహా గ్రామస్తులు అధికారుల వాహనాల ముందు నిరసన తెలిపారు. సర్వేను అడ్డుకున్నారు. తహసీల్దార్ వాహనాన్ని తోసి పడేసేందుకు ప్రయత్నించారు.
మరోవైపు నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తమ వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే సున్నపురాయి తవ్వకం, సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు వల్ల తమ సారవంతమైన వ్యవసాయ భూములు నాశనమవుతాయని, భూగర్భ వనరులను ఇది ప్రభావితం చేస్తుందని రైతులు ఆరోపించారు. అలాగే పలు ప్రాంతాల కుటుంబాలు నిరాశ్రయులవుతారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
धार : सर्वे के दौरान भयंकर बवाल, पुलिस टीम पर पथराव
चूना पत्थर खदान के सर्वे के लिए पहुंची प्रशासनिक टीम पर ग्रामीणों ने किया पथराव, कई सरकारी गाड़ियां क्षतिग्रस्त
प्रदर्शनकारियों का कहना है कि खदान से जमीन बंजर होगी और विस्थापन का खतरा बढ़ेगा, वीडियो हुआ वायरल pic.twitter.com/wKYseEvhSJ
— Bhaskar Digital (@Dbdigital_) February 19, 2026
Also Read:
Indore Woman Murder | ‘ఏది జరుగాలో అది జరిగింది’.. ప్రియురాలి హత్యపై నవ్వుతూ నిందితుడు
Watch: పాత్రలో ఇరుక్కున్న బాలుడి తల.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భర్తను మెడ వరకు పూడ్చిపెట్టిన భార్య.. శివలింగం మాదిరిగా తలపై అభిషేకం