Reba John | పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన ‘సామజవరగమనా’ హీరోయిన్ .. కూతురు పేరును కూడా ప్రకటించిన రెబా మోనికా జాన్
Reba John | తెలుగు ప్రేక్షకులకు 'సామజవరగమనా' సినిమాతో ఎంతో దగ్గరైన హీరోయిన్ రెబా మోనికా జాన్ అభిమానులకు శుభవార్త చెప్పింది. జూలై 22న ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న రెబా, తమ చిన్నారి పేరును కూడా వెల్లడించింది.
Reba John | తెలుగు ప్రేక్షకులకు ‘సామజవరగమనా’ సినిమాతో ఎంతో దగ్గరైన హీరోయిన్ రెబా మోనికా జాన్ అభిమానులకు శుభవార్త చెప్పింది. జూలై 22న ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న రెబా, తమ చిన్నారి పేరును కూడా వెల్లడించింది. తమ గారాలపట్టి పేరు ‘కియారా జోసెఫ్’ అని ప్రకటించింది.ఈ సందర్భంగా రెబా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేసింది. “హలో వరల్డ్… మా చిన్నారి కియారా జోసెఫ్‌కు హాయ్ చెప్పండి. మా జీవితాల్లోకి వచ్చిన చిన్న సూర్యకిరణం తను. గత కొద్ది రోజులుగా ఈ కొత్త అనుభూతిని ఆస్వాదిస్తూ, మా చిన్నారిని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఒక మహిళ శరీరం మరో ప్రాణానికి జన్మనివ్వడం నిజంగా ఓ అద్భుతం. గత తొమ్మిది నెలలుగా తనతో గడిపిన ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకం” అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.
అలాగే, తన భర్త జోయిస్టన్ క్రిస్టోఫర్‌తో కలిసి ఈ కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. తమ కూతురికి ప్రపంచాన్ని తమ కళ్లతో చూపించాలని, ముగ్గురిగా ఎన్నో మధుర జ్ఞాపకాలు సృష్టించుకోవాలని ఎదురుచూస్తున్నామని పేర్కొంది. తమ కుటుంబం కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ సమయంలో అందరి ఆశీస్సులు కావాలని అభిమానులను కోరింది. రెబా షేర్ చేసిన ఈ పోస్ట్, చిన్నారి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కెరీర్ విషయానికి వస్తే, మలయాళ చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న రెబా మోనికా జాన్, తెలుగులో ‘సామజవరగమనా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు తల్లిగా జీవితంలో మరో మధురమైన అధ్యాయాన్ని ప్రారంభించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

