ముంబై: మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ అల్యూమినియం పాత్ర తలపై పెట్టుకున్నాడు. ఆ పాత్రలోకి తల దూరి రాకపోవడంతో ఊపిరి ఆడక ఆ చిన్నారి ఏడ్వసాగాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పలు హాస్పిటల్స్‌కు తీసుకెళ్లగా నిరాకరించారు. (boy head stuck in vessel) చివరకు ఒక డాక్టర్ ముందుకు వచ్చారు. ప్లంబర్ సహాయంతో ఆ పాత్రను కట్ చేయించారు. మహారాష్ట్రలోని జల్గావ్లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 10న మూడేళ్ల బాలుడు ఇంట్లో ఆడుకున్నాడు. అల్యూమినియం పాత్రను తలపై కిరీటం మాదిరిగా పెట్టుకున్నాడు.
కాగా, ఆ బాలుడి తల ఆ పాత్రలో ఇరుక్కుపోయింది. మెడ చుట్టూ అది బిగుసుకున్నది. దీంతో బాబుకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆ బాలుడు బిగ్గరగా ఏడవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అయితే బాలుడికి ప్రమాదం జరుగుతుందని భావించి పాత్రను కట్ చేసేందుకు వారు నిరాకరించారు.
మరోవైపు ఒక హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ మినాజ్ పటేల్ ఆ బాలుడ్ని కాపాడేందుకు ముందుకు వచ్చారు. ప్లంబర్ ఖలీద్ షేక్‌ను రప్పించారు. ఆసుపత్రి సిబ్బంది సహాయంతో కట్టర్‌తో ఆ ప్రాతను కట్ చేసేందుకు ప్రయత్నించారు.
అయితే బాలుడికి ప్రమాదం జరుగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా పీయూసీ షీట్, తడి గుడ్డను ఉపయోగించారు. ప్లంబర్ ఖలీద్ షేక్ ఆ పాత్రను జాగ్రత్తగా కట్ చేశాడు. చివరకు అందులో ఇరుక్కున్న ఆ బాలుడి తలను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊరట చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
महाराष्ट्र के जलगांव में खेलते समय साढ़े तीन साल के बच्चे का सिर एल्युमिनियम के बर्तन में फंस गया, जिससे उसकी सांस लेने में दिक्कत होने लगी और जान पर बन आई. कई अस्पतालों के बाद डॉक्टर ने प्लंबर की मदद से कटर से बर्तन काटकर करीब 12 मिनट में बच्चे को सुरक्षित बाहर निकाला. घटना का… pic.twitter.com/1GnGavTTRp
— ABP News (@ABPNews) February 18, 2026
Also Read:
Indore Woman Murder | ‘ఏది జరుగాలో అది జరిగింది’.. ప్రియురాలి హత్యపై నవ్వుతూ నిందితుడు
Boy Kills Aunt | మేనత్తను హత్య చేసిన మేనల్లుడు.. సోఫా కమ్ బెడ్లో మృతదేహం