రాంచీ: ఒక్క అభ్యర్థి బోర్డు పరీక్ష కోసం అనూహ్యమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మెజిస్ట్రేట్తోపాటు 18 మంది సూపర్వైజర్లు, 12 మంది పోలీసులను ఆ పరీక్ష కేంద్రం వద్ద నియమించారు. ఇది చర్చనీయాంశమైంది. (Jharkhand lone candidate) జార్ఖండ్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. గర్హ్వా జిల్లాలోని హర్హేకు చెందిన 10వ తరగతి విద్యార్థి శంకర్ కుమార్ సింగ్, సంగీతాన్ని ఒక సబ్జెక్టుగా ఎంచుకున్నాడు. బోర్డు పరీక్షకు అతడు హాజరయ్యాడు. పరీక్షా కేంద్రమైన హర్హేలోని అప్గ్రేడెడ్ మిడిల్ స్కూల్లో ఆ పరీక్ష రాశాడు.
కాగా, బోర్డు పరీక్ష కోసం మ్యూజిక్ సబ్జెక్ట్ ఎంచుకున్న ఎకైక అభ్యర్థి శంకర్ కుమార్ సింగ్. ఈ నేపథ్యంలో అతడి పరీక్ష కోసం ఆ పరీక్షా కేంద్రం వద్ద విస్తృత ఏర్పాట్లు చేశారు. మెజిస్ట్రేట్తోపాటు 18 మంది సూపర్వైజర్లు, 12 మంది పోలీసులను ఆ కేంద్రం వద్ద నియమించారు. అయితే ఒక్క అభ్యర్థి పరీక్ష కోసం అసాధారణ రీతిలో ఇంత మంది సూపర్వైజర్లు, పోలీసులను నియమించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read:
Boy Kills Aunt | మేనత్తను హత్య చేసిన మేనల్లుడు.. సోఫా కమ్ బెడ్లో మృతదేహం
Watch: ప్రారంభించక ముందే పగుళ్లు.. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లీక్
Muslim Sisters Marry Hindu Cousins | హిందూ సోదరులను పెళ్లాడిన.. ముస్లిం సిస్టర్స్