ముంబై: ఒక బాలుడు మేనత్తను హత్య చేశాడు. స్నేహితుడితో కలిసి సోఫా కమ్ బెడ్లో ఆమె మృతదేహాన్ని దాచాడు. కుమారుడి సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. చివరకు మేనల్లుడు, అతడి ఫ్రెండ్ అయిన మరో బాలుడ్ని అరెస్ట్ చేశారు. (Boy Kills Aunt) మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాసాయిలో నివసించే మేనత్త అయిన 60 ఏళ్ల దుర్గా బన్సోద్ ఇంట్లో 15 ఏళ్ల మేనల్లుడు నివసిస్తున్నాడు.
కాగా, ఫిబ్రవరి 15న రాత్రి వేళ ఇంట్లోని స్మార్ట్ టీవీ స్లోగా స్టార్ కావడంతో దుర్గా చిరాకుపడింది. వస్తువులు సరిగా ఉంచుకోకపోవడం, చదువుపై దృష్టిసారించకపోవడంపై మేనల్లుడ్ని మందలించింది. ఆగ్రహించిన అతడు వెదురు కర్రతో మేనత్త తలపై కొట్టాడు. ఆమె తల పగిలి రక్తం కారడంతో కిందపడి మరణించింది. ఆందోళన చెందిన ఆ బాలుడు తన స్నేహితుడ్ని పిలిచాడు. అతడి సహాయంతో సోఫా కమ్ బెడ్లో మేనత్త మృతదేహాన్ని దాచాడు. ఆమె మొబైల్ ఫోన్ పగులగొట్టాడు. లోపల నుంచి డోర్ లాక్ చేశాడు. అతడు ఉండే రూమ్ డోర్‌ను జామ్ చేశాడు.
మరోవైపు బోయిసర్ ప్రాంతంలో నివసించే దుర్గా కుమార్తె తన తల్లికి పలుసార్లు ఫోన్ చేసింది. స్పందన లేకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. తల్లి ఇంటి సమీపంలో నివసించే సోదరుడ్ని వెళ్లి చూడమని చెప్పింది. మరునాడు దుర్గా కుమారుడు ఆ ఇంటికి వెళ్లాడు. మెయిన్ గేట్ లాక్ వేసి ఉండటంతో కిటికీ నుంచి లోపలకు చూశాడు. తల్లి కాళ్లు, రక్తం మరకలు కనిపించడంతో ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంటి డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండటంతో బాత్ రూమ్ కిటికీ వద్ద స్లాబ్ తొలగించి లోపలకు వెళ్లారు. సోఫా కమ్ బెడ్లో ఉన్న దుర్గా మృతదేహాన్ని బయటకు తీశారు. ఆమె తలపై గాయం, రక్తం మరకలు ఉండటంతో తలపై కొట్టడంతో చనిపోయినట్లు గ్రహించారు.
అయితే ఆ ఇంట్లో నివసించే మేనల్లుడైన బాలుడు భయంతో వణకడాన్ని పోలీసులు గమనించారు. అతడ్ని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో ఆ బాలుడితోపాటు సహకరించిన స్నేహితుడైన మరో మైనర్ బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: ఇంటిపైన బాంబులు తయారు చేస్తుండగా పేలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ప్రారంభించక ముందే పగుళ్లు.. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లీక్
Muslim Sisters Marry Hindu Cousins | హిందూ సోదరులను పెళ్లాడిన.. ముస్లిం సిస్టర్స్