Watch: ఇంటిపైన బాంబులు తయారు చేస్తుండగా పేలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Odisha Rooftop Explosion | కొందరు వ్యక్తులు వారి ఇంటిపైన బాంబులు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సీసీటీవీలో రికార్డైన ఈ పేలుడు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భువనేశ్వర్: కొందరు వ్యక్తులు వారి ఇంటిపైన బాంబులు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. (Odisha Rooftop Explosion) సీసీటీవీలో రికార్డైన ఈ పేలుడు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ఈ సంఘటన జరిగింది. జనవరి 27న మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో సుందర్పాడా ప్రాంతంలోని ఒక ఇంటిపై అక్రమంగా బాంబులు తయారు చేసేందుకు నలుగురు వ్యక్తులు ప్రయత్నించారు.
కాగా, ఈ సందర్భంగా భారీ పేలుడు సంభవించింది. మంటలు అంటుకోవడంతో ఒక మహిళ, మరికొందరు పరుగులు తీశారు. ఆ నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తికి తీవ్ర రక్త స్రావమైంది. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మృతులను షానవాజ్ మాలిక్, అతడి తల్లిగా పోలీసులు గుర్తించారు.
మరోవైపు స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు జరిగిన స్థలం నుంచి గన్పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో షానవాజ్ మాలిక్, అతడి సహచరుడు అమియా మాలిక్, అతడి తల్లి, మరో వ్యక్తి కలిసి వారి ఇంటిలో అక్రమంగా బాంబులు తయారు చేస్తున్నట్లు అనుమానించారు.
కాగా, షానవాజ్కు నేర చరిత్ర ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. అతడి కుటుంబం ఏదో కుట్ర కోసం బాంబులు తయారు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఇంట్లో మరింతగా తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా దర్యాప్తు కోసం రంగంలోకి దిగింది. మరోవైపు ఈ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Odisha– CCTV footage has surfaced of the powerful blast that rocked Sundarpada in #Bhubaneswar on January 29, leaving four people critically injured.
The explosion reportedly occurred in Azad Nagar while explosive substances were being handled on a rooftop.
1/2 pic.twitter.com/cEQ0WJPRVS— Siraj Noorani (@sirajnoorani) February 15, 2026
Also Read:
Chemical Factory Fire | కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి
Watch: కదులుతున్న కారుపై కూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత మృతి
Watch: లోడ్ ట్రాక్టర్ కింద కుంగిన రోడ్డు.. వ్యక్తికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
Watch: వాలంటైన్స్ డే రోజు ప్రియుడిని కలిసిన భార్య.. ఆమె భర్త ఏం చేశాడంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

