జైపూర్: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. సుమారు పది మంది కార్మికులు చిక్కకున్నట్లు అనుమానిస్తున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. (Chemical Factory Fire) రాజస్థాన్‌లోని భివాడిలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేట్ రసాయన కర్మాగారంలో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే ఆ ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో సుమారు 25 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నారు.
కాగా, మంటలను గమనించిన పలువురు కార్మికులు కెమికల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గంటన్నరపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఈ అగ్నిప్రమాదంలో ఏడుగురు కార్మికులు మరణించినట్లు గుర్తించారు. మరో పది మంది ఆచూకీ తెలియడం లేదు. ఆ ఫ్యాక్టరీలో లోపల వారు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
మరోవైపు కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ, జిల్లా అధికారులు తెలిపారు. మంటలకు కారణాన్ని గుర్తించడానికి, భద్రతా ప్రోటోకాల్స్‌లో లోపాలపై దర్యాప్తు కోసం మెజిస్టీరియల్ విచారణకు జిల్లా యంత్రాంగం ఆదేశించింది.
💔TRAGIC NEWS
7 workers killed in chemical factory fire in #Rajasthan‘s #Bhiwadi town, two people trapped inside. Praying for the safety of those trapped.
Om Shanti 🙏🏻 pic.twitter.com/LKTiQkzyBL
— Amitabh Chaudhary (@MithilaWaaala) February 16, 2026
#WATCH | Rajasthan: Seven people burned to death in a fire that broke out in a chemical factory in Bhiwadi of Khairthal-Tijara district. Their bodies have been recovered. Firefighting operations are underway. More details awaited.
(Video Source: Fire Department) pic.twitter.com/VjxVALnjh3
— ANI (@ANI) February 16, 2026
Also Read:
Watch: కదులుతున్న కారుపై కూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత మృతి
Watch: లోడ్ ట్రాక్టర్ కింద కుంగిన రోడ్డు.. వ్యక్తికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
Watch: వాలంటైన్స్ డే రోజు ప్రియుడిని కలిసిన భార్య.. ఆమె భర్త ఏం చేశాడంటే?