హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి గురువారం వాయుగుండంగా పశ్చిమబెంగాల్ తీరప్రాంతం వద్ద కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాబోయే 24 గంటల్లో గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్ – జార్ఖండ్ మీదుగా దాదాపు వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపారు. శుక్ర, శనివారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అకడకడ కురిసే అవకాశం ఉన్నది.