సమర్కండ్: చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు మరో విజయం అందుకుంది. వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ ఓటమి అంచుల్లోంచి తేరుకొని గెలవడంతో శుక్రవారం జరిగిన తొమ్మిదో రౌండ్లో 2.5-1.5తో జర్మనీపై ఉత్కంఠ విజయం సాధించింది.
తొలి మూడు బోర్డుల్లో ప్రజ్ఞానంద, అర్జున్, నిహాల్ గేమ్స్ డ్రా అవ్వగా.. చివరి బోర్డులో గుకేశ్ 54 ఎత్తుల్లో డొంచెంకో అలెగ్జాండర్‌ను ఓడించాడు. మరోవైపు మహిళల విభాగంలో భారత్ 3-1తో ఉజ్బెకిస్థాన్‌ను చిత్తు చేసింది.