జమ్ము, సెప్టెంబర్ 25: కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో శుక్రవారం తీర్మానం ప్రవేశపెట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని అది ముష్టిఘాతాలకు దారితీసింది.
తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు సభ మధ్యలోకి దూసుకువచ్చి అధికార పార్టీ సభ్యులతో గొడవ పడటమే కాక, ఒకరిపై ఒకరు అది ముష్టిఘాతాలకు దిగారు. కుర్చీలు పైకెత్తి దాడికి ప్రయత్నించారు. దీంతో స్పీకర్ సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ పునః ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళం కొనసాగింది.