Watch: కదులుతున్న కారుపై కూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత మృతి
High-Mast Pole Collapses On Car | రోడ్డుపై వెళ్తున్న కారుపై హై-మాస్ట్ బిల్బోర్డ్ స్తంభం కూలింది. ఆ కారు నడుపుతున్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఈ ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటన చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: రోడ్డుపై వెళ్తున్న కారుపై హై-మాస్ట్ బిల్బోర్డ్ స్తంభం కూలింది. ఆ కారు నడుపుతున్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఈ ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటన చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (High-Mast Pole Collapses On Car) ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం అంటూ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుగంజ్ మార్కెట్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద కొత్తగా హై-మాస్ట్ బిల్బోర్డ్ ఏర్పాటు చేస్తున్నారు.
కాగా, ఆ రోడ్డుపై ఒక కారు వెళ్తున్నది. అయితే కొత్తగా నిర్మిస్తున్నహై-మాస్ట్ బిల్బోర్డ్ పోల్ కూలిపోయింది. కదులుతున్న కారుపై అది పడింది. కారు డ్రైవ్ చేస్తున్న 48 ఏళ్ల ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. కారులోనే ఆయన మరణించారు.
మరోవైపు పోలీసులు, స్థానిక అధికారులు అక్కడకు చేరుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
यूपी के प्रतापगढ़ में दर्दन!क हादसा…
बाबूगंज बाजार में हाईमास्ट लाइट का पोल अचानक चलती क्रेटा कार पर गिरा।
हादसे में समाजवादी पार्टी से जुड़े नेता लाल बहादुर यादव की जान चली गई।
घटना भारत पेट्रोल पंप के सामने हुई। इलाके में अफरा-तफरी, पुलिस जांच जारी।
सुरक्षा मानकों पर फिर… pic.twitter.com/Bk1yVjdD8R
— Prof. इलाहाबादी ( نور ) (@ProfNoorul) February 15, 2026
सड़क पर भगवान भरोसे ही चलिए, भ्रष्ट सिस्टम कब आपकी जान ले ले, किसी को नहीं पता.
अब इस घटना को ही देख लीजिए. यूपी के प्रतापगढ़ में सपा नेता लाल बहादुर यादव अपनी कार से जा रहे थे. रास्ते में अचानक से गाड़ी पर बिजली का पोल आ गिरा. हादसे में उनकी मौके पर ही मौत हो गई.
कल ऐसे ही… pic.twitter.com/ALAfMyxper
— Priya singh (@priyarajputlive) February 15, 2026
Also Read:
Watch: లోడ్ ట్రాక్టర్ కింద కుంగిన రోడ్డు.. వ్యక్తికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
chemical factory explosion | కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
Watch: వాలంటైన్స్ డే రోజు ప్రియుడిని కలిసిన భార్య.. ఆమె భర్త ఏం చేశాడంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

