IND vs NZ | టీ బ్రేక్‌కు పుంచుకున్న భారత్.. 3 ఓవర్లలో 3 వికెట్లు!
IND vs NZ | న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో తొలి రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ పుంజుకుంది. ఒక దశలో వికెట్ కోల్పోకుండా పరుగులు చేస్తున్న కివీస్‌ను వరుస దెబ్బలతో ఒత్తిడిలోకి నెట్టింది.
IND vs NZ | న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో తొలి రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ పుంజుకుంది. ఒక దశలో వికెట్ కోల్పోకుండా పరుగులు చేస్తున్న కివీస్‌ను వరుస దెబ్బలతో ఒత్తిడిలోకి నెట్టింది. లంచ్ తర్వాత చాలా సేపు వికెట్ కోసం ఎదురుచూసిన భారత బౌలర్లు.. డ్రింక్స్ బ్రేక్ అనంతరం మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీశారు. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 50 ఓవర్లలో 131/4 స్కోరు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (59) అర్ధ సెంచరీతో రాణించగా.. ఆకాష్ దీప్ రెండు, అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ తీసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే శుభారంభం ఇచ్చారు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా బంతిని స్వింగ్ చేస్తూ, సీమ్‌తో ఇబ్బంది పెట్టినా.. ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించారు. కాన్వేను 31 పరుగుల వద్ద అరంగేట్ర ఆటగాడు గుర్నూర్ బ్రార్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపించాడు. లంచ్ సమయానికి న్యూజిలాండ్ 77/1తో నిలిచింది. మరోవైపు లాథమ్ అప్పటికే క్రీజులో కుదురుకొని భారత బౌలర్లకు పరీక్షగా మారాడు.
లాథమ్‌కు అదృష్టం కూడా కలిసొచ్చింది. 29వ ఓవర్లో గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అప్పీల్ వచ్చినా భారత్ రివ్యూ తీసుకోలేదు. రీప్లేల్లో బంతి ప్యాడ్‌కు తగిలినట్లు కనిపించడంతో భారత్ కీలక అవకాశాన్ని కోల్పోయినట్లయింది. ఆ తర్వాత ఆకాష్ దీప్ బౌలింగ్‌లో లాథమ్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో కేఎల్ రాహుల్ అందుకోలేకపోయాడు. ఈ అవకాశాలను ఉపయోగించుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెన్రీ నికోల్స్ కూడా క్రీజులో నిలదొక్కుకోవడంతో భారత బౌలర్లకు వికెట్ దక్కలేదు.
అయితే టీ బ్రేక్‌కు ముందు భారత్ ఒక్కసారిగా మ్యాచ్‌పై పట్టు సాధించింది. 41వ ఓవర్లో ఆకాష్ దీప్ అద్భుతమైన బంతితో లాథమ్‌ను 59 పరుగుల వద్ద రిషభ్ పంత్ చేతికి క్యాచ్ ఇచ్చేలా చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో నికోల్స్ పుల్ షాట్ ఆడగా.. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని లాంగ్ లెగ్‌లో ఆకాష్ దీప్ సులభంగా అందుకున్నాడు. ఇలా వరుసగా రెండు వికెట్లు పడటంతో న్యూజిలాండ్ 110/3కు చేరింది.
ఇక 44వ ఓవర్లో ఆకాష్ దీప్ మరోసారి మ్యాజిక్ చేశాడు. రచిన్ రవీంద్రను ఆఫ్ స్టంప్ బయట పడిన బంతితో ముందుకు రప్పించి, బ్యాట్ ఎడ్జ్ చేయించాడు. వికెట్ వెనుక రిషభ్ పంత్ క్యాచ్ అందుకోవడంతో రాచిన్ డకౌట్ అయ్యాడు. దీంతో 110 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. మూడు వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీసిన భారత బౌలర్లు మ్యాచ్‌లో ఆధిపత్యాన్ని తిరిగి అందుకునేలా చేశారు.
ఆ తర్వాత టామ్ బ్లండెల్, డారిల్ మిచెల్ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా టీ బ్రేక్ వరకు తీసుకెళ్లారు. భారత బౌలర్లు ఇంకా బంతిని కదిలిస్తుండటంతో వీరిద్దరూ ఎక్కువగా రక్షణాత్మకంగా ఆడారు. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 131/4తో నిలిచింది. బ్లండెల్ 8, మిచెల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | టీ బ్రేక్‌కు పుంచుకున్న భారత్.. 3 ఓవర్లలో 3 వికెట్లు!
India vs Nz | రెండో టెస్టులో విజృంభిస్తున్న భారత బౌలర్స్.. టీ సమయానికి న్యూజిలాండ్ స్కోరు ఎంతంటే..!
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వచ్చేసిన వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఏకే47’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్..!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. నరేష్‌కు సన్నీ సపోర్ట్ , వెక్కి వెక్కి ఏడ్చిన వర్షిణి!
Asia Cup Rising Stars | భారత్ ఖేల్‌ఖతం.. సెమీస్‌లోనే ఓడిన తిలక్సేన
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

