Mumbai Metro Slab Collapse | మెట్రో స్లాబ్ కూలిన ఘటనలో ఐదుగురు అరెస్ట్.. కాంట్రాక్టర్లకు రూ.6 కోట్లు జరిమానా
Mumbai Metro Slab Collapse | ముంబైలో మెట్రో స్లాబ్ కూలిన సంఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేసింది. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న కాంట్రాక్టర్లకు రూ.6 కోట్ల జరిమానా విధించింది. నిర్మాణ సంస్థకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మెట్రో స్లాబ్ కూలిన సంఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేసింది. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న కాంట్రాక్టర్లకు రూ.6 కోట్ల జరిమానా విధించింది. (Mumbai Metro Slab Collapse) నిర్మాణ సంస్థకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం ములుండ్‌లోని ఆర్టరీ ఎల్బిఎస్ మార్గ్‌లో నిర్మాణంలో ఉన్న మెట్రో లైన్ స్లాబ్ ఊడింది. రోడ్డుపై వెళ్తున్న ఆటో, ఒక కారుపై ఆ భారీ స్లాబ్ పడింది. ఒక వివాహానికి వెళ్తున్న స్థానిక సమాజ్‌వాదీ పార్టీ నేత, గ్రామ పెద్ద రామ్ధన్ యాదవ్ ఈ ప్రమాదంలో మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే ఈ సంఘటనపై సీరియస్‌గా స్పందించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యజీత్ సాల్వేను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్ సంస్థలైన మిలన్ రోడ్ బిల్డ్‌టెక్, లూయిస్ బెర్గర్లపై రూ.6 కోట్ల జరిమానా విధించినట్లు తెలిపారు. భద్రతా, నిర్మాణపరంగా మొత్తం మెట్రో మార్గాన్ని సమగ్రంగా ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే యాదవ్ కుటుంబానికి పరిహారాన్ని రూ.15 లక్షలకు పెంచినట్లు షిండే వెల్లడించారు.
మరోవైపు ముంబై పోలీసులు కూడా ఈ ప్రమాదంపై చర్యలు చేపట్టారు. నిర్మాణ సంస్థ మిలన్ రోడ్ బిల్డ్టెక్కు చెందిన నలుగురు ఉద్యోగులను, డీబి హిల్ ఎల్బీజీ సూపర్వైజరీ కంపెనీకి చెందిన ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ హరీష్ చౌహాన్, ఇద్దరు ప్రాజెక్ట్ మేనేజర్లు అరెస్టైన వారిలో ఉన్నట్లు వివరించారు.
Also Read:
Man Kills Wife | భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు పట్టించిన కుమారులు
Thief Targeted Only Cops’ Homes | 15 ఏళ్ల కిందట కొట్టారని.. పగతో పోలీస్ ఇళ్లల్లో వ్యక్తి చోరీలు
Watch: బాలికను పక్కకు లాక్కెళ్లిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- Collapse
- Contractors
- fined
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

