లక్నో: ట్యూషన్‌కు వెళ్తున్న బాలికను లాక్కెళ్లేందుకు ఒక బాలుడు ప్రయత్నించాడు. ఆమె అరవడంతోపాటు ప్రతిఘటించింది. భయపడిన అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Girl Dragged by Boy) ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఒక బాలిక మరో ఇద్దరు బాలికలతో కలిసి నడుస్తూ ట్యూషన్‌కు వెళ్తున్నది.
కాగా, ఒక బాలుడు దారిలో వేచి ఉన్నాడు. బాలిక అక్కడకు రాగానే ఆమె చేయిపట్టుకున్నాడు. పక్కకు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆందోళన చెందిన ఆ బాలిక గట్టిగా అరిచింది. అతడి నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో భయపడిన అతడు బాలికను వదిలేసి పారిపోయాడు.
మరోవైపు బాలిక కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी – हापुड़ में 3 छात्राएं रास्ते से निकल रही थीं, एक मनचले लड़के ने छात्रा को खींचने का प्रयास किया। शोर मचाने पर वो भाग निकला। @hindipatrakar pic.twitter.com/02ew8ZUOlk
— Sachin Gupta (@SachinGuptaUP) February 14, 2026
Also Read:
Anil Vij | ‘నా ఆదేశాన్ని పాటించాలి’.. మహిళా పోలీస్ అధికారిణిపై మంత్రి ఆగ్రహం
teen boy dies by suicide | ప్రియురాలితో బ్రేకప్.. వాలంటైన్స్ డే రోజున యువకుడు ఆత్మహత్య
Love, bullets on Valentine’s Day | ప్రేమికుల దినోత్సవం రోజున విషాదం.. కారులో కాల్పులు, జంట మృతి
Woman Killed By Married Lover | ప్రేమను గుడ్డిగా నమ్మి వచ్చింది.. సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలింది