Love, bullets on Valentine’s Day | ప్రేమికుల దినోత్సవం రోజున విషాదం.. కారులో కాల్పులు, జంట మృతి
Love, bullets on Valentine's Day | ప్రేమికుల దినోత్సవం రోజు విషాదం జరిగింది. కారులో ఉన్న యువ జంట తుపాకీ కాల్పుల్లో మరణించారు. 15 ఏళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రియుడు ఒక నోట్లో పేర్కొన్నాడు.
న్యూఢిల్లీ: ప్రేమికుల దినోత్సవం రోజు విషాదం జరిగింది. కారులో ఉన్న యువ జంట తుపాకీ కాల్పుల్లో మరణించారు. 15 ఏళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రియుడు ఒక నోట్లో పేర్కొన్నాడు. (Love, bullets on Valentine’s Day) దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం నోయిడా సెక్టార్ 39 సమీపంలో ఆగి ఉన్న కారు నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. భయాందోళన చెందిన స్థానికులు ఆ కారు వద్దకు వెళ్లి పరిశీలించారు. కారు లోపల ఉన్న యువ జంట బుల్లెట్ గాయాలతో మరణించినట్లు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నోయిడా సెక్టార్ 58లో నివసించే రేఖ, ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో నివసించే సుమిత్‌ను మృతులుగా గుర్తించారు. శుక్రవారం వారిద్దరూ తమ ఇళ్ల నుంచి మిస్సింగ్ కావడంతో వారి కుటుంబాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
మరోవైపు ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే సుమిత్ వద్ద లభించిన నోట్ ద్వారా వారిద్దరూ 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. తనను పెళ్లి చేసుకుంటానని రేఖ హామీ ఇచ్చిందని, అయితే ఆమె వేరొకరిని వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవలే తనకు తెలిసినట్లు అందులో పేర్కొన్నాడు.
కాగా, డ్రైవర్ సీటులో కుప్పకూలిన సుమిత్ చేతిలో పిస్టల్ ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీంతో మొదట రేఖను కాల్చి చంపిన అతడు తనను తాను కాల్చుకున్నట్లు అనుమానిస్తున్నారు. 20 ఏళ్ల వయస్సున్న యువ జంట మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వారి మరణం గురించి ఇరు కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
#WATCH | Uttar Pradesh: A man and a woman found dead in a car under Sector 39 Police Station limits of Noida. Police investigation has begun. Bodies have been sent for postmortem. pic.twitter.com/oVzBhiOTxr
— ANI (@ANI) February 14, 2026
Also Read:
Woman Killed By Married Lover | ప్రేమను గుడ్డిగా నమ్మి వచ్చింది.. సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలింది
Rahul Gandhi | రైతు సంఘాల నేతలతో రాహుల్ గాంధీ భేటీ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చ
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

