Rahul Gandhi | రైతు సంఘాల నేతలతో రాహుల్ గాంధీ భేటీ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చ
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పలు రైతు సంఘాల నేతలను కలిశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన ఆయన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో రైతు నేతలతో భేటీ అయ్యారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై చర్చించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పలు రైతు సంఘాల నేతలను కలిశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన ఆయన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో రైతు నేతలతో భేటీ అయ్యారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై చర్చించారు. ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖ్‌పాల్ ఎస్ ఖైరా, హర్యానాకు చెందిన భారతీయ కిసాన్ మజ్దోర్ యూనియన్ నేత అశోక్ బల్హారా, బీకేయూ క్రాంతికారి నేత బల్దేవ్ ఎస్ జిరా, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఫ్రంట్‌కు చెందిన ఆర్ నందకుమార్ తదితరులు రాహుల్ గాంధీని కలిసిన వారిలో ఉన్నారు.
కాగా, భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై రైతు సంఘాల నేతలతో రాహుల్ గాంధీ చర్చించారు. సోయాబీన్, పండ్లు, గింజలు, పత్తి, మొక్కజొన్న రైతుల ప్రయోజనాలు, జీవనోపాధిపై ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలు కాపాడటంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి మోదీ లొంగిపోయారని, దేశ రైతులను ఆయన మోసం చేశారని సోషల్ మీడియాలో విమర్శించారు.
మరోవైపు రైతు సంఘాల నేతలతో రాహుల్ గాంధీ సమావేశంపై బీజేపీ స్పందించింది. ఇది కల్పిత, కృతిమ భేటీ అని విమర్శించింది. రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమని, భారత రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఆరోపించారు.
Also Read:
Woman Killed By Married Lover | ప్రేమను గుడ్డిగా నమ్మి వచ్చింది.. సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలింది
Watch: రోజ్ డే రోజున భర్తను ఆశ్చర్యపరిచిన భార్య.. షాక్ ఇచ్చిన పోలీసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- calls
- discuss
- farmer leaders
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

