Spain | క్రికెట్లో స్పెయిన్ తుఫాన్.. ఆస్ట్రేలియా ‘ఆల్‌టైమ్ రికార్డు’ బ్రేక్..!
Spain : యూరప్ ఖండానికి చెందిన స్పెయిన్(Spain) ఫుట్‌బాల్ ఆటలోనే కాదు క్రికెట్లోనూ దూసుకెళ్తోంది. ఈ మధ్యే ఆ దేశ సాకర్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌ను ఒడిసిపట్టగా.. స్పెయిన్ క్రికెట్ జట్టు అత్యధిక విజయాలతో ఆస్ట్రేలియా (Australia) 'ఆల్‌టైమ్ రికార్డు'ను బ్రేక్ చేసింది.
Spain : యూరప్ ఖండానికి చెందిన స్పెయిన్ (Spain) ఫుట్‌బాల్ ఆటలోనే కాదు క్రికెట్లోనూ దూసుకెళ్తోంది. ఈ మధ్యే ఆ దేశ సాకర్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌ను ఒడిసిపట్టగా.. తాజాగా స్పెయిన్ పురుషుల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా (Australia) ‘ఆల్‌టైమ్ రికార్డు’ను బ్రేక్ చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో అనామక జట్టుగా అడుగుపెట్టి.. వరసగా 21 విక్టరీలతో ఆసీస్‌ను రెండో స్థానానికి తోసేసిందీ యూరప్ జట్టు. అంతేకాదు 2028లో టీ20 వరల్డ్ కప్ బెర్తుకు గట్టి పోటీదారుగా మారింది స్పెయిన్.
టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి ఆటలకు పేరొందిన స్పెయిన్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లోనూ అదరగొడుతోంది. టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న స్పెయిన్.. టీ20 వరల్డ్‌కప్ యూరప్ ఉప ప్రాంతీయ క్వాలిఫయర్ సీ మ్యాచ్‌లో ఆదివారం ఫిన్లాండ్పై 8 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో రెండేళ్ల తర్వాత రాబోయే పొట్టి ప్రపంచకప్‌లో ఆడే అవకాశానికి మరింత చేరువైంది.
A new chapter in international cricket history 🇪🇸
Spain officially break Australia’s long-standing 2003 World Record 🔥
Catch the action from ICC Men’s T20 WC Europe Sub Regional Qualifier LIVE only on FanCode 📲#Cricket #Spain #Australia #Record #ICCCWC pic.twitter.com/qunox9jNVg
— FanCode (@FanCode) August 16, 2026
ప్రస్తుతం టీ20ల్లో 28వ ర్యాంకులో ఉన్న స్పెయిన్‌కు పొట్టి ఫార్మాట్లో ఇది వరసగా 21 విజయం. దాంతో, వరసగా 20 విజయాలతో రికార్డు నెలకొల్పిన ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది. 2023 నుంచి 2026 మధ్య 21 విజయాలతో స్పెయిన్ ఈ మైలురాయిని అందుకుంది. ఈ క్రమంలో జెర్సీ, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, ఫిన్లాండ్ వంటి జట్లను ఓడించింది యూరప్ టీమ్.
Most consecutive wins in International Cricket:
🇪🇸 21* – Spain (2023 – 2026)
🇦🇺 20 – Australia (2003)
🇺🇬 17 – Uganda (2024 – 2025)
🇦🇺 16 – Australia (2000 – 2001)
🇦🇺 16 – Australia (2006 – 2007)
🇵🇰 14 – Pakistan (1990)
🇵🇰 14 – Pakistan (2011 – 2012)
🇯🇵 14 – Japan (2024 – 2025)… pic.twitter.com/Z0uiwpk9bQ— CricketGully (@thecricketgully) August 15, 2026
దిగ్గజ సారథి రికీ పాంటింగ్ హయాంలో ఆస్ట్రేలియా 2003లో వరసగా 20 విజయాల(17 వన్డేలు, 3 టెస్టులు)తో చరిత్ర సృష్టించింది. దాదాపు ఇరవై మూడేళ్లుగా చెక్కు చెదరని ఈ రికార్డును స్పెయిన్ బద్ధలుకొట్టింది. ప్రస్తుతం.. రెండో స్థానంలో ఉండగా.. ఉగాండ(17 విజయాలు), పాకిస్థాన్(14 విజయాలు), జపాన్(14 విజయాలు), దక్షిణాఫ్రికా(13 విజయాలు), న్యూజిలాండ్(13 విజయాలు), మలేషియా(13 విజయాలు), బెర్ముడా(13 విజయాలు)లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

