Woman Killed By Married Lover | ప్రేమను గుడ్డిగా నమ్మి వచ్చింది.. సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలింది
Woman Killed By Married Lover | వివాహితుడైన వ్యక్తి ప్రియురాలిని హత్య చేశాడు. ఇనుప పెట్టెలో ఆమె మృతదేహం ఉంచాడు. కుటుంబ సభ్యుల సహాయంతో సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. దుర్వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
భోపాల్: వివాహితుడైన వ్యక్తి ప్రియురాలిని హత్య చేశాడు. ఇనుప పెట్టెలో ఆమె మృతదేహం ఉంచాడు. కుటుంబ సభ్యుల సహాయంతో సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. దుర్వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. (Woman Killed By Married Lover) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. కమలా నగర్లో నివసించే సమీర్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది కిందట మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల అష్రఫీ అలియాస్ సియా ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి పరిచయమైంది. దీంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
కాగా, మూడు నెలల కిందట సియా మహారాష్ట్ర నుంచి భోపాల్ చేరుకున్నది. సమీర్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. స్నేహితురాలు అని కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు. నాటి నుంచి సియా ఆ ఇంట్లో సహజీవనం చేస్తున్నది. తనను పెళ్లి చేసుకోవాలని సమీర్‌ను ఆమె ఒత్తిడి చేస్తున్నది. ఈ నేపథ్యంలో సమీర్ భార్య, సియా మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి తీవ్రం కావడంతో సమీర్ భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
మరోవైపు సియా, సమీర్ మధ్య గొడవలు మరింత పెరిగాయి. తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. లేనిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఫిబ్రవరి 9న సాయంత్రం వేళ వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆగ్రహించిన సమీర్ గొంతునొక్కి సియాను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని పడేసేందుకు తల్లి, సోదరుడు, సోదరి సహాయం కోరాడు. వారంతా కలిసి ఇనుప ట్రంక్ పెట్టెలో సియా మృతదేహాన్ని కుక్కారు. అర్ధరాత్రి వేళ చీకటిలో తీసుకెళ్లి నిషాత్పురా ప్రాంతంలోని ఖాళీ స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో ఆ పెట్టెను పడేశారు.

Body In Septic Tank
అయితే ఫిబ్రవరి 12న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న పిల్లలు సెప్టిక్ ట్యాంక్ నుంచి దుర్వాసన రావడాన్ని గమనించి తమ కుటుంబాలకు చెప్పారు. స్థానికులు అక్కడకు వచ్చి చూడగా సెప్టిక్ ట్యాంక్‌లో తేలుతున్న ఇనుప పెట్టె కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. పెట్టెను బయటకు తీసి తెరిచారు. అందులో కుళ్లిన మహిళ మృతదేహం ఉండటం చూశారు. పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
కాగా, మహిళ శరీరంపై ఉన్న టాటూ, బర్త్ డే డేట్ ఆధారంగా సియాగా పోలీసులు గుర్తించారు. ఆమె హత్యపై దర్యాప్తు చేశారు. ప్రియుడు సమీర్ ఆమెను హత్య చేసి తన కుటుంబ సభ్యులతో కలిసి మృతదేహాన్ని పెట్టెలో ఉంచి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. సియా గతంలో మహారాష్ట్ర, రాజస్థాన్‌లో మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా తెలిసిందని చెప్పారు. ఆమె హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
Also Read:
Watch: ఐదుగురిపైకి కారు దూకించిన విద్యార్థి.. ఆరేళ్ల బాలుడు మృతి
Watch: డ్యాన్సులతో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందం.. వారిపైకి దూసుకెళ్లిన లారీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

