లక్నో: ఫేర్వెల్ పార్టీ నుంచి ఇంటికి తిరిగి వెళ్లున్న విద్యార్థి కారుపై నియంత్రణ కోల్పోయాడు. ఐదుగురు వ్యక్తులపైకి కారును దూకించాడు. ఈ సంఘటనలో ఆరేళ్ల బాలుడు మరణించాడు. ప్రమాదం తర్వాత కారు వదిలేసి పారిపోయిన ఆ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Lucknow Student Runs Car) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల గౌరవ్ సింగ్ 12వ తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం ఫేర్వెల్ పార్టీ తర్వాత కారులో ఇంటికి బయలుదేరాడు.
కాగా, వేగంగా దూసుకెళ్లిన ఆ కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో దానిపై ఉన్న వ్యక్తి కిందపడి గాయపడ్డాడు. అయితే బైక్‌ను ఢీకొట్టిన తర్వాత ఆ కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కగా నిల్చొని ఉన్న ఒక కుటుంబంపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఈ-ఆటో, ఆటోను ఆ కారు ఢీకొట్టింది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది. విద్యార్థి గౌరవ్ సింగ్, అతడి స్నేహితుడు కారు నుంచి దిగి అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు కారు దూసుకెళ్లడంతో ఆ కుటుంబానికి చెందిన అర్మాన్, సాధనా పటేల్, ఆమె తల్లి మీనా దేవి గాయపడ్డారు. సాధన ఆరేళ్ల కుమారుడు దీక్షాంత్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ-ఆటో డ్రైవర్ అవధ్ బిహారీ కూడా గాయపడ్డాడు.
కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ప్రమాదానికి గురైన ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థి గౌరవ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే బైక్, జనంపైకి కారు దూసుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
लखनऊ में क्लास 12 के स्टूडेंट ने रात में पार्टी कर बच्चों को कुचला।
Now don’t say write an essay .
Why parents give cars to such childrens ,when they are knowing they are rash drivers.
Now time to set an example by giving exemplary punishment.#norashdriving… pic.twitter.com/SUp8OPWs4O— Milind Chatse (@Chatsemilind013) February 13, 2026
लखनऊ में कार से 6 लोगों को रौंदने वाला 12वीं का स्टूडेंट गौरव सिंह गिरफ्तार हो गया है। इस हिट एंड रन की CCTV फुटेज भी सामने आई है।
इसमें आरोपी गौरव 100 किमी प्रति घंटे से ज्यादा की स्पीड में कार चलाता हुआ नजर आ रहा है। कार में साथ में उसकी गर्लफ्रेंड भी थी। दोनों किसी फेयरवेल… pic.twitter.com/8m1GUrU2zQ— Gaurav Pandey (@gaurav5pandey) February 13, 2026
Also Read:
Watch: రోడ్డుపై జారిన బైక్.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి
Watch: రూ.1.62 లక్షల విలువైన ఐఫోన్ చోరీ.. వీడియో వైరల్‌తో కానిస్టేబుల్స్ సస్పెండ్
Watch: ‘నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు’.. కస్టమర్‌ను దూషించిన బ్యాంకు ఉద్యోగిని